క‌రోనాటెస్ట్ః మొద‌టిగా వాణిజ్య ఆమోదం పొందిన మైల్యాబ్‌

దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ల్యాబ్‌ల‌తో పాటు ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ ప‌రీక్ష‌లు చేసేందుకు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న సంస్థ అనుమ‌తినిచ్చింది. ఇప్పుడు దేశీయంగా వైరస్‌ను కనుగొనే మందును..

క‌రోనాటెస్ట్ః మొద‌టిగా వాణిజ్య ఆమోదం పొందిన మైల్యాబ్‌
Follow us

|

Updated on: Mar 24, 2020 | 12:50 PM

దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ల్యాబ్‌ల‌తో పాటు ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ ప‌రీక్ష‌లు చేసేందుకు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న సంస్థ అనుమ‌తినిచ్చింది. ఇప్పుడు దేశీయంగా వైరస్‌ను కనుగొనే మందును టెస్ట్ చేసేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ మేర‌కు మైల్యాబ్ సంస్థ వాణిజ్య అనుమ‌తిని సాధించింది. ప్యాన్ ఇండియా పుణేలో ఉన్న ప‌ర‌మాణు విశ్లేష‌ణ కేంద్రం మై ల్యాబ్ డిస్క‌వ‌రీ సోల్యూష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు… కోవిడ్‌-19 వైర‌స్‌ను ప‌రీక్షించేందుకు మొద‌టి మేడిన్ ఇండియా టెస్ట్ కిట్‌ను ఆరు వారాల గ‌డువులో అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా ఐసీఎంఆర్ విశ్లేష‌ణ‌లో వంద‌శాతం సున్నిత‌త్వం, విశిష్ట‌త పొందిన ఏకైక భార‌తీయ కంపెనీగా మైల్యాబ్ నిలిచింది.

ఈ మేర‌కు మ‌న దేశంలో అత్యాధునిక సాంకేతిక‌త‌తో పాటు ఆమోద‌యోగ్య‌మైన‌, సామాన్యుల‌కు సైతం అందుబాటులో ఉండే ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చేలా మేము ప్ర‌య‌త్నిస్తున్నాం. ఈ ప‌రీక్ష పీసీఆర్ సాంకేతికంతో కూడియున్నందు వ‌ల్ల సంక్ర‌మ‌ణ‌ను చాలా తొంద‌ర‌గా, ఖ‌చ్చిత‌త్వ‌మైన విధంగా త‌క్కువ స‌మ‌యంలోనే క‌నుగోనే విధంగా కృషిచేస్తామ‌ని మైల్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శైలేంద్ర క‌వాడే స్ప‌ష్టం చేశారు.

ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షించే కిట్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ కానీ, యూరొపియన్ సీఈ కానీ ఆమోదం ఇవ్వలేదని స్ప‌ష్టం చేసింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆమోదం మేరకు వారు పరీక్షలు చేస్తున్నారని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం పేర్కొన్నారు. అంతకుముందు మాత్రం ప్రభుత్వం కిట్లకు యూఎస్ ఎఫ్‌డీఏ లేదంటే, యూరొపియన్ సీఈ ఆమోదం తప్పనిసరి అని పేర్కొన్న సంగతి తెలిసిందే.

కరోనా వైరస్‌కు సంబంధించి నమూనాలను సేకరించి పరీక్షించేందుకు అమెరికా బృందం సేకరించి..ఇండియాకు పంపిస్తోందని తెలిపింది. అవి దేశంలోని ప్రయోగశాలలకు పంపిణీ చేస్తున్నామని ఐసీఎంఆర్ పేర్కొన్నది. ఐసీఎంఆర్ తొమ్మిది కిట్లను మూల్యంకనం చేసింది. ఇందులో రెండు అట్లాంటా డయాగ్నొస్టిక్స్‌కు చెందినది కాగా, రెండోది మై ల్యాబ్‌కి చెందినది. ప్రైవేట్ ల్యాబుల కోసం వివరణలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఐసీఎంఆర్ పేర్కొన్నది.