కరోనా దెబ్బ.. షహీన్‌బాగ్ ఖాళీ.. 9మంది అరెస్ట్..
ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రబలుతుంటే.. ఢిల్లీలో ఆందోళనకారుల తీరుమాత్రం మారడం లేదు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నా.. ఢిల్లీలోని షహీన బాగ్ ఆందోళనకారులు మాత్రం అందుకు విరుద్ధంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు నిరసన శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు. ఢిల్లీ వ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని నెలలుగా వందలాది మంది మహిళలు […]
ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రబలుతుంటే.. ఢిల్లీలో ఆందోళనకారుల తీరుమాత్రం మారడం లేదు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నా.. ఢిల్లీలోని షహీన బాగ్ ఆందోళనకారులు మాత్రం అందుకు విరుద్ధంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు నిరసన శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు. ఢిల్లీ వ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని నెలలుగా వందలాది మంది మహిళలు షహీన్‌బాగ్ శిబిరంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.
అయితే ఖాళీ చేయించే సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 144 సెక్షన్ ను ఉల్లంఘించారని వారిపై కేసులు నమోదు చేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఢిల్లీ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సీఏఏ వ్యతిరేక నిరసన శిబిరాన్ని తొలగించనట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా.. దేశంలో ప్రస్తుతం చాపకింద నీరులా వ్యాపిస్తోంది ఈ వైరస్. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాయి ప్రభుత్వాలు.