ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారి వివరాల కోసం ప్రత్యేక యాప్..!

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయినప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మందుల దుకాణాల్లో దగ్గు, జలుబు, జ్వరం మాత్రలను కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక యాప్‌ రూపొందిస్తోంది. కాగా అనుమానిత లక్షణాలున్న కొందరు మందులను నేరుగా దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. […]

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారి వివరాల కోసం ప్రత్యేక యాప్..!
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2020 | 2:02 PM

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయినప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మందుల దుకాణాల్లో దగ్గు, జలుబు, జ్వరం మాత్రలను కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక యాప్‌ రూపొందిస్తోంది.

కాగా అనుమానిత లక్షణాలున్న కొందరు మందులను నేరుగా దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. జబ్బు ముదిరిన తరువాత ఆసుపత్రులకు పరుగెడుతున్నారు. దీనివల్ల కేసులు మరింత ఎక్కువవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందుల దుకాణాల వారు జ్వరం, జలుబు, దగ్గు మాత్రల కోసం వచ్చిన వారి పేరు, సెల్‌ఫోన్ నంబర్ నమోదు చేసేలా యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్‌కు వచ్చిన వివరాలను కోవిడ్19 కేంద్రానికి పంపించనున్నారు. వీటి ద్వారా ఆరోగ్యశాఖ ఉద్యోగులు సంబంధితులతో మాట్లాడి.. వారు చెప్పే లక్షణాలు, ఇతర వివరాల మేరకు చర్యలు తీసుకోబోతున్నారు.

Read This Story Also: లాక్‌డౌన్ నిబంధనలను‌ ఉల్లంఘించి పార్టీ.. సీనియర్ నటి క్లారిటీ