AP Corona: ఏపీలో కరోనా కల్లోలం.. అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్.. కోవిడ్ హాస్పిటల్స్‌పై స్పెషల్ ఫోకస్..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 33,339 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 547 కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం..

AP Corona: ఏపీలో కరోనా కల్లోలం.. అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్.. కోవిడ్ హాస్పిటల్స్‌పై స్పెషల్ ఫోకస్..
Covid Hospitals
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 07, 2022 | 8:16 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 33,339 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 547 కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోవిడ్ యాక్టివ్ కేసులు 2286 ఉన్నాయి. 13జిల్లాలో మొత్తం 236 ఆసుపత్రుల్లో అందుతున్న కోవిడ్ కి చికిత్స అందిస్తున్నాయి. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 334 ఇలా ఉంటే.. అందులో జెనరల్ వార్డు లో ఉన్నవారు 61 మంది.. ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్న వారు 82 మంది ఉన్నారు. అయితే ఆక్సిజన్‌‌తో చికిత్స పొందుతున్న ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్న వారు 177 మంది ఉన్నారు. వెంటిలేటర్‌పై ట్రీట్మెంట్ పొందుతున్న వారు మాత్రం 14 మంది ఉన్నారు. వీరు కాకుండా హోమ్ క్వారంటైన్ ఐసోలేషన్‌లో 1952 మంది ఉన్నవారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,78,923కి చేరింది. కాగా.. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారితో విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 14,500కి పెరిగింది. ఈ మేరకు ఏపీ వైద్యఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ఇదిలావుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్స్ పై దృష్టి సారించాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఏపీలో అన్ని జిల్లాల వైద్య అధికారులను వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఉండకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Dharmavaram Politics: హాట్‌ హాట్‌గా అనంతపురం రాజకీయాలు.. ధర్మవరంపై కన్నేసిన ఆ ముగ్గురు..

గుడ్‌న్యూస్.. QR కోడ్‌ని స్కాన్ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు తెలుసా.. పూర్తి వివరాలు ఇవే..