క‌రోనా క‌ట్ట‌డికి.. ఢిల్లీ యూనివ‌ర్సిటీ యాంటీ బాడీస్‌

క‌రోనా క‌ట్ట‌డికి.. ఢిల్లీ యూనివ‌ర్సిటీ యాంటీ బాడీస్‌

దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. వైర‌స్కి వ్యాక్సిన్ క‌నుగోనేప‌నిలో ప్ర‌పంచ దేశాలు కృషి చేస్తున్నాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని సంస్థలు బయోటెక్నాలజీ..

Jyothi Gadda

|

Apr 13, 2020 | 10:40 AM

దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. వైర‌స్కి వ్యాక్సిన్ క‌నుగోనేప‌నిలో ప్ర‌పంచ దేశాలు కృషి చేస్తున్నాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని సంస్థలు బయోటెక్నాలజీ విభాగం సహకారంతో యాంటీ బాడీ స్‌ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. భారత్‌ లో.. ఢిల్లీ యూని వర్సిటీ సౌత్‌ క్యాంపస్‌ సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ ఇన్‌ఫెక్షన్‌ డిసీస్‌ రీసెర్చ్‌, ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌లో విజయ్‌ చౌదరీ ఆధ్వర్యంలో.. పరిశోధనలు కొనసాగుతున్నాయి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో బయోటెక్నాలజీ విభాగంతో కలిసి చౌదరీ ముందుకు వెళ్తున్నారు. చౌదరీ నేతృత్వంలోని బృందం.. జెన్యువులను ఎన్‌కోడింగ్‌ చేసే ప్రతిరోధకాలను వేరుచేస్తుంది.
ఇది సార్స్‌-కోవ్‌-2ను తటస్థం చేయగలదు. ఎవరైతే.. కోవిడ్‌ – 19 నుంచి కోలుకున్నారో వారి కణాలను సేకరించే ఈ ప్రయోగాలను నిర్వహించడం జరుగుతోంది. ల్యాబోరేటరీల్లో యాంటీబాడీస్‌ను తయారు చేయడంలో యాంటీబాడీ జెన్యువులు ఉపయోగపడుతాయి. ఇది కరోనా వైరస్‌ను తటస్థం చేయడంలో విజయవంతం అయితే.. కోవిడ్‌ – 19 రోగులకు చికిత్స కోసం యాంటీబాడీస్‌ ఎంతో ఉపయోగకరంగా మారుతాయి. చౌదరీకి.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీలో పని చేస్తున్న అమూల్య పాండా,పుణేలోని జెన్నోవా బయో ఫార్మా స్యూటికల్‌ లిమిటెడ్‌లో పని చేసే సంజయ్‌ సింగ్‌ సహాయకులుగా ఉన్నారు.
ఇదిలా ఉంటే, దేశంలో  కొన‌సాగుతున్న 21 రోజుల లాక్‌డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. పలు రాష్ట్రాలు దీనిపై నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణ, ఒడిశా, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ్ బెంగాల్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి. అయితే, ఏప్రిల్ 15 తర్వాత దేశాన్ని మూడు జోన్‌లు విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లు‌గా గుర్తించనున్నట్టు సమాచారం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu