ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న కేసుల రాష్ట్రాల్లో ఏపీ కూడా చేరిపోయింది. మహారాష్ట్రకు..

img

ఏపీలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న కేసుల రాష్ట్రాల్లో ఏపీ కూడా చేరిపోయింది. మహారాష్ట్రకు పోటీగా.. రోజురోజుకు ఏపీలో కూడా వేల కేసుల సంఖ్యలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,128 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో
రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,86,461కి చేరింది. ఇక వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,04,354కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,426 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 1,681 మంది మరణించారు. ఈ విషయాన్ని ఏపీ ఆరోగ్య మంత్రిత్వ
శాఖ వెల్లడించింది. కాగా, గడిచిన 24 గంటల్లో 60,576 కరోనా టెస్టులు చేపట్టారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన కరోనా టెస్టుల సంఖ్య 22.35 లక్షలకు చేరుకుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu