బ్రహ్మానందం గీసిన “ఆంజనేయుని తన్మయత్వం”

మరోసారి తనలోని కళాకారుడిని వెన్నుతట్టి లేపాడు. ఇందులో రాముడిని ఆలింగనం చేసుకున్న ఆంజనేయుడు తన్మయత్వంతో ఆనందబాష్పాలు కారుస్తున్నట్లుగా ఉంది. రాముడికి గుడి కడుతున్న వేళ హనుమంతుడు ఇలాగే ఆనందపడుతున్నాడేమో అన్నట్లుగా కనిపిస్తోంది....

బ్రహ్మానందం గీసిన ఆంజనేయుని తన్మయత్వం

Another Lovely Pencil Sketch by Hasya brahma  : హాస్య బ్రహ్మ బ్రహ్మానందంలోని రామ భక్తుడు మరోసారి బయటకొచ్చాడు. రామ జన్మ భూమిలో ఆలయ నిర్మాణ భూమి పూజ నిర్వహించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇప్పటికే చాలా సార్లు రంగుల రాముడిని హనుమంతుడిని తన కుంచెతో బంధించిన నవ్వుల రాజు.

రామజన్మభూమి భూమి పూజ సందర్భంగా మరోసారి తనలోని కళాకారుడిని వెన్నుతట్టి లేపాడు. ఇందులో రాముడిని ఆలింగనం చేసుకున్న ఆంజనేయుడు తన్మయత్వంతో ఆనందబాష్పాలు కారుస్తున్నట్లుగా ఉంది. రాముడికి గుడి కడుతున్న వేళ హనుమంతుడు ఇలాగే ఆనందపడుతున్నాడేమో అన్నట్లుగా కనిపిస్తోంది. బ్రహ్మానందం గీసిన ఈ చిత్రానికి నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. చిత్రం అద్భుతంగా ఉంది.. మీలో గొప్ప ప్రతిభ ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu