AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Corona Update : ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలో కరోనా కేసులు ఇలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా మరో సారి కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి మహారాష్ట్ర రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని

Andhra Pradesh Corona Update : ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలో కరోనా కేసులు ఇలా ఉన్నాయి.
corona-virus
Rajeev Rayala
|

Updated on: Mar 14, 2021 | 1:00 AM

Share

Andhra Pradesh Corona Update: దేశవ్యాప్తంగా మరో సారి కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి మహారాష్ట్ర రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో లాక్డౌన్ విధించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అంతగా కనిపించడంలేదు. ఇక ఏపీ లో కరోనా కేసుల సంఖ్య అలావుందంటే.. ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా 8,91,563 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 1,268 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. జిల్లాలవారీగా చూసినట్లయితే..

అనంతపురం : 

ఇక అనంత పురం జిల్లాలో కరోనా కేసులు విషయానికొస్తే ఇప్పటివరకు జిల్లాలో మొత్తంగా 67,848 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 52 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 67185 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గతంతో పోలిస్తే కరోనా కేసులు జిల్లాలో తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి.

చిత్తూరు : 

ఇక చిత్తూరు జిల్లాలో కరోనా విలయ తాండవమే చేసింది. మొత్తంగా ఇప్పటివరకు జిల్లాలో 87,980 కేసులు నమోదు అయ్యాయి. కాగా ప్రస్తుతం 447 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే 87,533 మంది డిశ్చార్జ్ అయ్యారు.

తూర్పు గోదావరి జిల్లా 

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 1,24,614 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 136 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా మహమ్మారి నుంచి ఇప్పటివరలు 124,478 మంది డిశ్చార్జ్ అయ్యారు.

గుంటూరు : 

అదేవిధంగా గుంటూరు జిల్లా విషయానికొస్తే ఇప్పటివరకు కరోనా మహమ్మారి 75,863 మందిపై దాడి చేసింది. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 80 గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గుముఖం పెట్టిందనే చెప్పాలి. 75093 మంది కావున నుంచి కోలుకున్నారు.

కడప :

ఇక వైఎస్ఆర్ కడప జిల్లా లో ఇప్పటివరకు మొత్తంగా  55,455 కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం 48 కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉయ్న్తున్నారు. ఇక ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 54933గా ఉంది.

కృష్ణ :

అదే విధంగా కృష్ణ జిల్లాలో ఇప్పటివరకు 49,120 కేసులు నమోదు అయ్యాయి. ఇక కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం తో ప్రజలంతా ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 175 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అలాగే కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిసంఖ్య 48254గా ఉంది .

కర్నూల్ : 

ఇక కర్నూలు విషయాని కొస్తే కరోనా ఈ జిల్లాలోనూ విలయతాండవమే చేసింది. ఇప్పటివరకు జిల్లాలో 60,947 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 60410 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం కర్నూలు జిల్లావ్యాప్తంగా 40 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

నెల్లూరు : 

ఇక నెల్లూరు జిల్లా విషయానికొస్తే ఇప్పటివరకు 62528 మంది కావున మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 61976 మంది కోలుకున్నారు. గతంతో పోల్చుకుంటే కరోనా వ్యాప్తి జిల్లాలో చాలావరకు తగ్గుమొకం పట్టింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు వహిస్తున్నారు.

ప్రకాశం : 

అదేవిధంగా ప్రకాశం డిస్ట్రిక్ లో కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య ఇప్పటివరకు 62,241గా ఉంది. అలాగే 61603 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక జిల్లాలో యాక్టివ్ గా ఉన్న కరోనా కేసులు 58 గా ఉన్నాయి.

శ్రీకాకుళం : 

శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు 46,293 మంది కరోనా మహ్యమ్మరి బారిన పడ్డారు. అలాగే 45883 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 51 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

విశాఖపట్నం : 

అలాగే సాగరతీరం విశాఖపట్నంలో ఇప్పటి వరకు కరోనా కేసులు 60,218గా నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి నుంచి 59533మంది బయటపడ్డారు. అలాగే ప్రస్తుతం విశాఖ జిల్లావ్యాప్తంగా 94 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

విజయనగరం : 

ఇక విజయనగరం జిల్లా విషయానికొస్తే 41,179 కేసులు ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా నమోదు అయ్యాయి. అలాగే కరోనా బారినుంచి ఇప్పటివరకు 40926 మంది బయటపడ్డారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కేవలం 15 కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి.

పశ్చిమగోదావరి : 

అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటివరకు 94,377 కేసులు నమోదు అయ్యాయి. 93801మంది ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం 29 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

LockDown: భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌ విధించిన అధికారులు..

AP Corona: ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు