“మహా” పోలీసులకు కరోనా టెన్షన్.. మరో 75 మందికి పాజిటివ్..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల తీవ్రత విపరీతంగా ఉంది. ఇక్కడ సామాన్యులతో పాటు.. అటు పోలీసులను కూడా కరోనా వదలట్లేదు. ఇప్పటికే దాదాపు పద్దెనిమిది వందల మంది పోలీసులకు కరోనా సోకింది. అంతేకాదు.. పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా.. మరో 75 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చిన పోలీస్ సిబ్బంది సంఖ్య 1,964కు […]

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల తీవ్రత విపరీతంగా ఉంది. ఇక్కడ సామాన్యులతో పాటు.. అటు పోలీసులను కూడా కరోనా వదలట్లేదు. ఇప్పటికే దాదాపు పద్దెనిమిది వందల మంది పోలీసులకు కరోనా సోకింది. అంతేకాదు.. పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా.. మరో 75 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చిన పోలీస్ సిబ్బంది సంఖ్య 1,964కు చేరింది. ఇందులో 849 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1,095 మంది పలు ఆస్ప్రత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంటే.. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి నమోదవుతుండటంతో.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ముంబై పట్టణంలో అత్యధికంగా కేసులు నమోదవ్వగా.. ఆ తర్వాత పూణె, థానే పట్టణాల్లో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 54, 758 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఇందులో 16,954 మంది కరోనా నుంచి కోలుకున్నారు.1792 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.