దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే 380 మంది మృతి..
కరోనా మహమ్మారి దేశంలో విలయ తాండవం చేస్తోంది. అన్‌లాక్ 1.0 తర్వాత.. దేశంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
కరోనా మహమ్మారి దేశంలో విలయ తాండవం చేస్తోంది. అన్‌లాక్ 1.0 తర్వాత.. దేశంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆస్పత్రుల్లో బెడ్లన్నీ ఫుల్ అయ్యాయి. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం రికవరీ రేటు బాగుందంటూ ప్రకటిస్తోంది. పలుచోట్ల సామాజిక వ్యాప్తి ఉండటంతో.. కేసులను ట్రేస్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా సోమవారం నాడు కొత్తగా మరో 19,459 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,318కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,10,120 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 3,21,723 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి దేశ వ్యాప్తంగా 16,475 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు వ్యాక్సిన్ రాకపోవడంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పలు నగరాల్లో కేసులు పెరుగుతుండటంతో.. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు.