ఈడీ కార్యాలయాన్ని తాకిన కరోనా.. ముగ్గురు అధికారులకు పాజిటివ్‌..

ఢిల్లీలోని ఈడీ కార్యాలయాన్ని కరోనా తాకింది. ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రధాన కార్యాలయంలోని అధికారులకు రావడంతో.. దీనిని మూసేశారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:38 pm, Sat, 6 June 20
ఈడీ కార్యాలయాన్ని తాకిన కరోనా.. ముగ్గురు అధికారులకు పాజిటివ్‌..

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 68 లక్షల దాటి 70 లక్షల దిశగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సామాన్య ప్రజల్నే కాదు.. అన్ని వర్గాల ప్రజలను, అధికారులను, ప్రజా ప్రతినిధులను ఇది టచ్ చేస్తోంది. భాషా, ప్రాంతం, కులం, మతం అన్న తేడా లేకుండా.. అందర్నీ ఒకేలా చూస్తోంది ఈ మహమ్మారి వైరస్. ఇక మన దేశంలో కూడా ఇది విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. ఇక మన దేశంలో కూడా అన్ని ప్రాంతాలను తాకడమే కాకుండా.. అటు సామాన్యులను, ప్రజా ప్రతినిధులను ప్రభుత్వ ఉద్యోగులను వదలడం లేదు.

తాజాగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయాన్ని కూడా తాకింది. ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రధాన కార్యాలయంలోని అధికారులకు రావడంతో.. దీనిని మూసేశారు. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఈడీ అధికారులకు కరోనా సోకింది. అంతేకాదు.. మరో ఇద్దరు ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో లోక్‌నాయక్ భవన్‌ను శానిటైజేషన్ చేసి.. సీజ్ చేశారు. ఆదివారం వరకు ఈ కార్యాలయాన్ని సీజ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిన అధికారులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి కుటుంబ సభ్యలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా కరోనా పాజిటివ్ వచ్చిన వారితో కలిసి పనిచేసిన వారందర్నీ క్వారంటైన్‌కు తరలించారు.