WCDSC Warangal Jobs 2023: రాత పరీక్షలేకుండా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.. పది/ఇంటర్ అర్హత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వరంగల్‌లోని మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్స్ లిటరసీ స్పెషలిస్ట్, మల్టీ-పర్పస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వరంగల్‌లోని మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్స్ లిటరసీ స్పెషలిస్ట్, మల్టీ-పర్పస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో (ఎకనామిక్స్/బ్యాంకింగ్ విభాగాల్లో) డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో మే 7, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా సంబంధిత సర్టిఫికెట్లతోపాటు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ, అనుభవం, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంటర్వ్యూ మే 5వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు పోస్టును బట్టి రూ.15,600ల నుంచి రూ.38,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
హౌస్ నెంబర్ 6-1-8L, పబ్లిక్ గార్డెన్ ఎదురుగా, టీటీడీ కళ్యాణ మండపం దగ్గర, జిల్లా సంక్షేమ అధికారి మహిళలు పిల్లలు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయం, హనుమకొండ, తెలంగాణ.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.