SBI Recruitment 2023: బ్యాంక్ జాబ్స్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 217 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ముంబాయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో.. 217 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన..
ముంబాయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో.. 217 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సటీ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ లేదా తత్సమాన డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబందిత పనిలో నోటిఫికేషన్లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు మార్చి 31, 2023వ తేదీ నాటికి తప్పనిసరిగా 32 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో మే 19, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 2023 జూన్ నెలలో ఉంటుంది. ఎంపికై వారికి నెలకు రూ.63,840ల నుంచి రూ.78,230ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
- మేనేజర్ పోస్టులు: 2
- డిప్యూటీ మేనేజర్ పోస్టులు: 44
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 136
- అసిస్టెంట్ వీపీ పోస్టులు: 19
- సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 1
- సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 15
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.