WAPCOS: ఇంజనీరింగ్ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
దేశ రాజధాని న్యూఢిల్లిలోని వ్యాప్‌కోస్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఇంజనీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు...

దేశ రాజధాని న్యూఢిల్లిలోని వ్యాప్‌కోస్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఇంజనీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్/జూనియర్ డిజైన్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సీనియర్ డిజైన్ ఇంజినీర్/ కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్, సీనియర్ డిజైన్ ఇంజినీర్, జూనియర్ మెకానికల్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి.



* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంఈ(స్ట్రక్చర్ ఇంజినీరింగ్). డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* ఎస్‌డీఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 45 ఏళ్లు, జేఎంఈ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను కరిక్యులం విటేని హెడ్ (పర్సనల్), వ్యాప్‌కోస్ లిమిటెడ్, ప్లాట్ నెం.76-సి, ఇనిస్టిట్యూషనల్ ఏరియా, సెక్టార్-18, గురుగ్రామ్, హరియాణా అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 16-11-2022 తేదీని చిరవి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..




