AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tik Tok Classes: టిక్‌ టాక్‌లో వీడియోలు చేయడానికి శిక్షణ.. విచిత్ర కోర్సుని ప్రారంభించిన యూనివర్సిటీ..!

Tik Tok Classes: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం. ఇక్కడ అందరూ స్టార్ అవ్వాలని ప్రయత్నిస్తారు. ప్రపంచంలో చాలా మంది వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో

Tik Tok Classes: టిక్‌ టాక్‌లో వీడియోలు చేయడానికి శిక్షణ.. విచిత్ర కోర్సుని ప్రారంభించిన యూనివర్సిటీ..!
Tik Tok Classes
uppula Raju
|

Updated on: May 11, 2022 | 6:43 AM

Share

Tik Tok Classes: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం. ఇక్కడ అందరూ స్టార్ అవ్వాలని ప్రయత్నిస్తారు. ప్రపంచంలో చాలా మంది వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ప్రతినెలా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వాస్తవానికి ఇది ఒక రకమైన ప్రతిభ. అయితే ఇలా చేయడానికి కూడా కాలేజీల్లో కోర్సు ఉందని మీకు తెలుసా.. ఆశ్చర్యపోకండి అమెరికాలోని ఓ యూనివర్సిటీ ఇలాంటి ‘విచిత్రమైన’ కోర్సును ప్రారంభించింది. ఇక్కడ వీడియోలు చేయడం, డబ్బు సంపాదించడానికి శిక్షణ ఇస్తారు. అవును మీరు దీన్ని జోక్‌గా భావించవచ్చు. కానీ ఇది పూర్తిగా నిజం. ఈ కొత్త కోర్సుకు ‘బిల్డింగ్ గ్లోబల్ ఆడియన్స్’ అని పేరు పెట్టారు. సాధారణ భాషలో దీనిని టిక్‌టాక్ క్లాసులు అని పిలుస్తారు. ఈ కోర్సు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం రూపొందించారు. ఇందులో మీరు సోషల్ మీడియాలో మీ ఉనికిని ఎలా పెంచుకోవచ్చో చెబుతారు. నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ ఆఫ్ డర్హామ్ ఈ ప్రత్యేక కోర్సును ప్రారంభించింది.

ఆరోన్ డినిన్ ఈ కోర్సు ప్రొఫెసర్

డ్యూక్స్ ఇన్నోవేషన్ & ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్ ఆరోన్ డినిన్ ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఆయనే స్వయంగా ఈ కోర్సును ప్రారంభించడం విశేషం. నివేదికల ప్రకారం.. ఒక వీడియోని ఎలా సిద్దం చేయాలి. దానిని పోస్ట్ చేయడం ద్వారా ఎలా సంపాదించాలి. వ్యక్తిగత ఇమేజ్‌ ఎలా పెంచుకోవాలి తదితర విషయాలని ఈ కోర్సులో బోధిస్తారు. ఈ కోర్సుకి మంచి స్పందన వస్తోంది. ఈ కోర్సు చేస్తున్న విద్యార్థులందరు కలిసి టిక్‌టాక్‌లో 1.5 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. దీంతో పాటు వారు చేసే వీడియోలకు 80 మిలియన్లకు పైగా అంటే 8 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కోర్సు చేస్తున్న సమయంలోనే నటాలియా హోడ్జర్ అనే విద్యార్థిని రూ.5 లక్షల వరకు సంపాదిస్తోంది.

మరిన్ని కెరియర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

AP News: చిత్తూరు జిల్లా ఆస్పత్రికి మాజీ మంత్రి నారాయణ.. వైద్య పరీక్షల నిర్వహణ.. మెజిస్ట్రేట్‌ ముందు హాజరు..

LSG vs GT: 80 పరుగులకే సర్దేసిన లక్నో.. 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన గుజరాత్

Viral Video: తెల్లపులి, పసుపు పులి మధ్య భీకర పోరు.. మామూలుగా లేదు ఫైట్‌..!