Telugu Academy Books: జాబ్ నోటిఫికేషన్స్ ఎఫెక్ట్.. తెలుగు అకాడమీలో బుక్స్ కొరత.. అభ్యర్థులకు నిరాశ..!

Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రకటన రావడంతో ఒక్కసారిగా తెలుగు అకాడమీ పుస్తకాలకు డిమాండ్ పెరిగింది.

Telugu Academy Books: జాబ్ నోటిఫికేషన్స్ ఎఫెక్ట్.. తెలుగు అకాడమీలో బుక్స్ కొరత.. అభ్యర్థులకు నిరాశ..!
Telugu Academy
Follow us
Shiva Prajapati

|

Updated on: May 11, 2022 | 5:39 AM

Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రకటన రావడంతో ఒక్కసారిగా తెలుగు అకాడమీ పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. తాజాగా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ రావడంతో ఈ పుస్తకాలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. తెలుగు అకాడమీ కౌంటర్‌ వద్ద అభ్యర్థులు క్యూ కడుతున్నారు. అయితే తెలుగు అకాడమీ బుక్‌ కౌంటర్‌లో పలు అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో లేవు. దీంతో పుస్తకాల కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది.

తాజాగా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ రావడంతో తెలుగు అకాడమీ పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే వారికి తెలుగు అకాడమీ పబ్లిష్ చేసే బుక్స్ ఎంతో కీలకం. హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకానమీ, భారత రాజ్యాంగం వంటి పుస్తకాల కోసం అభ్యర్థులు ఎక్కువగా తెలుగు అకాడమీని ఆశ్రయిస్తుంటారు. కానీ మార్కెట్‌లో తెలంగాణ స్టడీ మెటీరియల్‌ దొరకడం లేదు. డిమాండ్‌కు తగినట్లుగా మార్కెట్‌లో స్టాక్ ఉండటం లేదు.

సబ్జెక్టు ఏదైనా తెలుగు అకాడమీ పుస్తకాలకున్న ప్రాధాన్యతే వేరు. అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం, విషయ నిపుణుల విశ్లేషణలతో కూడిన ఆ పుస్తకాలు పోటీ పరీక్షల్లో విజయానికి బాటలు వేస్తాయనే భావన అభ్యర్థుల్లో ఎప్పట్నుంచో ఉంది. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఇటీవల గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల కావడం.. మొదటి నోటిఫికేషన్‌లోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కరెంట్ అఫైర్స్, తెలంగాణ ఎకానమీ లాంటి ముఖ్యమైన బుక్స్ అందుబాటులో లేవు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు సరైన పుస్తకాలు లభించక నిరాశ చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మార్కెట్‌లో పోటీ పరీక్షలకు సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాల కొరత బాగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు వస్తున్నాయి. తెలుగు అకాడమీ పుస్తకాల కోసం వచ్చే అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. గ్రూప్స్‌కు సంబంధించి హిస్టరీ, ఎకానమీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ వంటి పుస్తకాలను ఎక్కువగా కొనేందుకు వస్తుంటారు. కానీ తెలుగు అకాడమీ దగ్గర తగినంత స్టాక్ లేదని సమాచారం. దీంతో పుస్తకాల కొరత అనేది విద్యార్థులు, ఎంట్రెన్స్ టెస్టులు రాసే వాళ్ల మీద కూడా ప్రభావం చూపుతోంది.

అసలు పుస్తకాల కొరతకు కారణమేంటి? తెలంగాణలో స్టడీ మెటీరియల్ దొరక్కపోవడానికి ప్రధాన కారణం భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రకటించడం. ఉద్యోగాల ప్రకటన వల్ల స్టడీ మెటీరియల్‌కు డిమాండ్ పెరిగింది. గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల కోచింగ్ సెంటర్లు ఎక్కువగా మూసే ఉండటం, నోటిఫికేషన్లు లేకపోవడంతో పుస్తకాలు పెద్దగా ప్రింట్ చేయలేదు. ఇప్పుడు డిమాండ్ పెరిగింది కదా అని పుస్తకాలు ప్రింట్ చేద్దామంటే పేపర్ దొరకడం లేదని . తెలుగు అకాడమీకి ఇప్పుడు ఇదే సమస్య అని మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడని అధికారి అన్నారు. ఇదే విషయాన్నీ చెప్పమంటే పై అధికారి అనుమతి లేకుండా మాట్లాడలేనని దాటవేశారు.

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రకటన రావడంతో ఒక్కసారిగా పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. కానీ పుస్తకాలను ప్రింట్ చేయడానికి తెలుగు అకాడమీ దగ్గర పేపర్ లేదు. మార్కెట్లో పేపర్‌కు కొరత ఉంది. అలాగే టెండర్లు ఖరారు చేయడంలోనూ తెలుగు అకాడమీ ఆలస్యం చేసింది. దీంతో పంజాబ్ నుంచి పేపర్ వచ్చింది. పుస్తకాల ప్రింటింగ్ మొదలయ్యింది. మరొక రెండు వారాల్లో పుస్తకాలు మార్కెట్‌లోకి వస్తాయి అని తెలుగు అకాడమీకి చెందిన ఒక ఉద్యోగి తెలిపారు.

కరోనా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ దెబ్బతినడం, యుక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరగడంతో పేపర్ దిగుమతులు కూడా భారంగా మారాయి. అభివృద్ధి, పర్యావరణ సమస్యలకు సంబంధించిన పుస్తకాలు కేవలం ఆంగ్లంలోనే ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో అభ్యర్థులకు సమయం అత్యంత కీలకంగా మారింది. ఎన్నాళ్లుగానో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.కానీ తెలుగు అకాడమీ పుస్తకాల కొరత ఉండటంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పటికైనా తెలుగు అకాడమీ అధికారులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?