UPSC Prelims Exam 2022: జూన్ 5 న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష.. OMR షీట్ సమాచారం అందించిన యూపీఎస్సీ..
UPSC Prelims Exam 2022: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షని జూన్ 5న నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు
UPSC Prelims Exam 2022: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షని జూన్ 5న నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఒక ముఖ్యమైన నోటీసును జారీ చేసింది. ఈ పరీక్ష కోసం OMR షీట్‌ను ఎలా నింపాలో కమిషన్ అభ్యర్థులకు సూచించింది. పరీక్ష సమయంలో అభ్యర్థులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నింపేందుకు సరైన పద్ధతిని కమిషన్ తెలిపింది.OMR షీట్ చిత్రాలను షేర్ చేస్తూ అభ్యర్థులకు అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నించింది. అభ్యర్థులు ఒక్కసారి వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు.
పరీక్ష సమయంలో ఓఎంఆర్ షీట్‌లో ప్రతి సర్కిల్‌ను ఎలా నింపాలో నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో పాటు అటెండెన్స్ షీట్ నింపేందుకు సరైన మార్గాన్ని చెప్పింది. పరీక్ష సమయంలో అభ్యర్థులు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండేందుకు కొన్ని చిత్రాలను షేర్ చేసింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2022 ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు షార్ట్‌లిస్ట్ అవుతారు. మెయిన్స్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ కోసం ప్రత్యేక తేదీలు ప్రకటిస్తారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు.
ప్రతి సంవత్సరం లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. ఈ పరిస్థితిలో అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. తద్వారా వారు సరైన సమాచారాన్ని పొందవచ్చు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు.
మరిన్ని కెరియర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి