AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC CDS Exam 2022: యూపీఎస్సీ సీడీఎస్‌ 2022 హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌- I 2022కు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదలయ్యాయి..

UPSC CDS Exam 2022: యూపీఎస్సీ సీడీఎస్‌ 2022 హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
Upsc Cds 2022
Srilakshmi C
|

Updated on: Mar 15, 2022 | 9:36 AM

Share

UPSC CDS 1 exam 2022 admit card: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌- I 2022కు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదలయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.in.లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్ 10న యూపీఎస్సీ సీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2022 పరీక్ష దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. హాల్ టికెట్లు పోస్ట్ ద్వారా పంపబడవని, వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్లలో అభ్యర్ధులకు సంబంధించిన వివరాల్లో ఏవైనా తప్పులు దొర్లితే కమిషన్‌ దృష్టికి తీసుకురావచ్చని ఈ సందర్భంగా సూచించింది. కాగా ఈ పరీక్ష ద్వారా మొత్తం 134 పోస్టులు భర్తీకానున్నాయి. అడ్మిట్ కార్డుపై స్పష్టమైన ఫోటోగ్రాఫ్‌లు లేని అభ్యర్థులు పరీక్ష రోజున ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్‌ తప్పనిసరిగా తీసుకురావాలి. అంటే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటరు కార్డ్ మొదలైనవి తీసుకురావచ్చు. పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందు పరీక్ష హాల్‌కు చేరుకోవాలి. ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్షకు సంబంధించిన ఇతర ముఖ్యసమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఈ సందర్భంగా యూపీఎస్సీ సూచించింది.

UPSC CDS admit card 2022లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే ‘E-Admit Cards for various Examinations of UPSC’ లింక్‌ పై క్లిక్ చేయండి.
  • న్యూ పేజ్‌ ఓపెన్‌ అయ్యాక సీడీఎస్ అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • రిజిస్ట్రేషన్ నంబర్ లేదా యూపీఎస్సీ సీడీఎస్‌ రోల్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్‌ అవ్వాలి.
  • వెంటనే స్క్రీన్‌పై అడ్మిట్ కార్డ్ 2022 ఓపెన్‌ అవుతుంది.
  • డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్‌ఔట్‌ తీసుకోవాలి.

Also Read:

Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర! టీఎస్‌ టెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల ఎప్పుడంటే..