Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర! టీఎస్‌ టెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల ఎప్పుడంటే..

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా పనిచేస్తోంది. ఈ ఉద్యోగాల్లో టీచర్‌ పోస్టులకు సంబంధించి ముందుగా టెట్

Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర! టీఎస్‌ టెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల ఎప్పుడంటే..
Ts Tet 2022
Follow us

|

Updated on: Mar 15, 2022 | 8:55 AM

Telangana Teachers Eligibility Test Notification to be released soon: తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా పనిచేస్తోంది. ఈ ఉద్యోగాల్లో టీచర్‌ పోస్టులకు సంబంధించి ముందుగా టెట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రెండు మూడు రోజుల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి (Sabitha Indra Reddy) తాజాగా తెలిపారు. సోమవారం (మార్చి 14) పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. గతంలో మాదిరిగానే ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష జరుపుతామని స్పష్టం చేశారు. మరో పక్క టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే ఆ స్కోరుకు ఏడేళ్లకు బదులు జీవితాంతం విలువ ఉండాలని, బీఈడీ అభ్యర్ధులకు పేపర్‌-I రాసే అవకాశం ఇచ్చేలా జీవో ఇవ్వాలంటూ అధికారులు ప్రతిపాదించారు. ఐతే ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించలేదు. తెలంగాణ టీచర్‌ పోస్టులను విద్యాశాఖ డీఎస్సీ లేదా టీఆర్టీ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నిరుద్యోగ యువత సన్నద్ధమవుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్‌ సెంటర్లు మళ్లీ కళకళలాడుతున్నాయి.

కాగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి తొలి నోటిఫికేషన్‌ పోలీసు శాఖ (Police Department) నుంచి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ( TSLPRB) కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జోన్ల వారీగా ఖాళీల జాబితాను సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. దీనికి ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్‌ వెలువడే ఛాన్స్‌ ఉంది. ప్రస్తుతమున్న సమచారం ప్రకారం ఈ నెలాఖరున లేదంటే ఏప్రిల్‌ మొదటి వారంలో పోలీసుల ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీసుశాఖలో సుమారు 18 వేలకుపైగా ఖాళీలున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Also Read:

Army Postal Service Recruitment 2022: టెన్త్‌ ఆర్హతతో ఇండియన్‌ ఆర్మీ పోస్టల్‌ సర్వీస్‌ ఉద్యోగాలు.. రూ. 56 వేల జీతంతో..