AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Layoffs: మళ్లీ మొదలైన ఉద్యోగుల తొలగింపు.. నిన్న కాగ్నిజెంట్‌, నేడు మరో ఈ కామర్స్‌ సంస్థ.

మరోసారి ఉద్యోగుల తొలగింపు వార్తలు ఉద్యోగుల్లో కలవరపెడుతున్నాయి. మొన్నటి వరకు పెద్దగా ఉద్యోగుల తొలగింపు లేదని సంతోషించే లోపే కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటి నిన్న సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ ఏకంగా 3500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నట్లు..

Layoffs: మళ్లీ మొదలైన ఉద్యోగుల తొలగింపు.. నిన్న కాగ్నిజెంట్‌, నేడు మరో ఈ కామర్స్‌ సంస్థ.
Layoffs
Narender Vaitla
|

Updated on: May 05, 2023 | 2:38 PM

Share

మరోసారి ఉద్యోగుల తొలగింపు వార్తలు ఉద్యోగుల్లో కలవరపెడుతున్నాయి. మొన్నటి వరకు పెద్దగా ఉద్యోగుల తొలగింపు లేదని సంతోషించే లోపే కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటి నిన్న సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ ఏకంగా 3500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దేశీయ ఈకామర్స్‌, యూనికార్న్‌ సంస్థ మీషో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

అయితే మీషో ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతేడాది మీషో మొత్తం 250 మందిని తొలగించింది. ఇక ఈసారి మీషో 251 మంది ఉద్యోగులను తొలగించింది. సంఖ్య చిన్నదే అయినప్పటికీ ఇది కంపెనీ మొత్తం సిబ్బందిలో 15 శాతం కావడం గమనార్హం. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మీషో సీఈఓ విదిత్ ఆత్రే ఉద్యోగులకు మెయిల్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు.

ఇదిలా ఉంటే ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి మీషో తరఫున సహకారం ఉంటుందని ఆత్రే తెలిపారు. ఉద్యోగం కోల్పోయిన వారికి 2.5 నుంచి 9 నెలల వేతనాన్ని పరిహారంగా ఇస్తామని తెలిపారు. ఈ పరిహారం ఉద్యోగుల పదవి, పనిచేసిన కాలం, వేతనం ఆధారంగా ఉంటుంది. ఉద్యోగులకు బీమా ప్రయోజనాలను కొనసాగిస్తూనే, కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడంలోనూ సహకరిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు