TSSPDCL JACO Result 2022: తెలంగాణ విద్యుత్ శాఖ జేఏసీఓ మెరిట్ జాబితా విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL)లో 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ (JACO) పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్ 24న కంప్యూటర్ నైపుణ్య పరీక్షను నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫలితాలు మంగళవారం (మే 11) విడుదల అయ్యాయి..

TSSPDCL JACO 2022 merit list: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL)లో 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ (JACO) పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్ 24న కంప్యూటర్ నైపుణ్య పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు మంగళవారం (మే 11) విడుదల అయ్యాయి. అర్హులైన అభ్యర్ధుల జాబితాను టీఎస్‌ఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చని సూచించింది. కాగా తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖలో 1271 పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 70, సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 201, జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 1000 ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మే 11 నుంచి ప్రారంభమయింది. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
Also Read:




