10th exams 2022: ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 43,489 మంది విద్యార్ధులు గైర్హాజరు.. సుమోటో విచారణకు ఉత్తర్వులు!

పెద్ద ఎత్తున విద్యార్ధుల గైర్హాజరు కావడంపై విచారణ జరిపించాలని అన్ని జిల్లాల డీఈఓలు జిల్లాల వారీగా విశ్లేషణ నిర్వహించి 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని..

10th exams 2022: ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 43,489 మంది విద్యార్ధులు గైర్హాజరు.. సుమోటో విచారణకు ఉత్తర్వులు!
Tenth Exams
Follow us

|

Updated on: May 12, 2022 | 9:37 AM

More than 40,000 students skip Odisha Class X board exams for this year: ఈ ఏడాది మే 7న ముగిసిన టెన్త్‌ క్లాస్‌ పబ్లిక్‌ (HSC) పరీక్షల్లో 43,489 మంది పదో తరగతి విద్యార్థులు గైర్హాజరు కావడంపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ పరీక్షలకు దాదాపు 5.71 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 5.3 లక్షల విద్యార్ధులు మాత్రమే పరీక్షలకు హాజరయినట్లు విద్యా శాఖ గుర్తించింది. దీంతో స్కూల్ అండ్‌ మాస్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ బిష్ణుపాద సేథీ అన్ని జిల్లాల విద్యా అధికారులకు (DEOs) విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వారి వారి జిల్లాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున గైర్హాజరు కావడంపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. డీఈఓలు కూడా తమ జిల్లాల వారీగా విశ్లేషణ నిర్వహించి 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మయూర్‌భంజ్, గంజాం, బోలంగీర్ జిల్లాల నుంచి అత్యధిక విద్యార్ధులు గైర్హాజరయ్యారు.

కాగా ఒడిసా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE Odisha) నిర్వహించే HSC 2022 పరీక్షలు, 3,540 కేంద్రాల్లో ఏప్రిల్ 30న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు గరిష్టంగా 43,489 మంది విద్యార్ధులు హాజరుకాలేదు. గత ఏడాది (2021) కేవలం 4,412 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరుకాలేదు. ఈ సంవత్సరం హెచ్‌ఎస్‌సి పరీక్షలకు వేలాది మంది అభ్యర్థులు గైర్హాజరవడం ఆందోళన కలిగించే విషయమని, DEOలు తమ జిల్లాల్లో పాఠశాలల వారీగా హాజరుకాని విద్యార్ధుల విశ్లేషణపై నివేదికను సమర్పించాలని సెక్రటరీ సేథి ఆదేశాలు జారీ చేశారు.

“కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇప్పటికే విద్యార్థుల చదువులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరైన ప్రిపరేషన్‌ లేకపోవడం వల్ల విద్యార్ధుల పరీక్షలకు హాజరుకాలేకపోయి ఉండవచ్చని ఒడిశా స్కూల్ అండ్‌ మాస్ ఎడ్యుకేషన్ మంత్రి సమీర్ రంజన్ దాష్ అభిప్రాయపడ్డారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది మెట్రిక్ విద్యార్థులకు పరీక్ష ఫీజును మాఫీ చేసినట్లు మంత్రి ఎత్తి చూపారు. వీరితోపాటు ఒడిశా స్టేట్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (OSCPCR) కూడా పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు పెద్ద ఎత్తున గైర్హాజరుకావడంపై సుమోటో (suo-motu) సుమోటోగా విచారణకు స్వీకరించింది. అంతేకాకుండా ఈ విషయాన్ని పరిశీలించి వారంలోగా నివేదిక సమర్పించాలని సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్, బీఎస్ఈలను కోరింది.

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ పరీక్షల్లోనూ ఇదే పరిస్థితి.. మే 6 నుంచి ప్రారంభమయిన తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షల్లో తొలిరోజే దాదాపు 22,210 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. మొత్తం 4,64,756 మంది హాజరవ్వాల్సి ఉండగా.. 4,42,546 మంది (95.30 శాతం) మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అంటే రాష్ట్రవ్యాష్తంగా సగటున 4.70 శాతం విద్యార్ధులు గైర్హాజరయ్యారు. వీరిలో ఒక్క సిద్దిపేట జిల్లా నుంచే 7.50 శాతం విద్యార్ధులు గైర్హాజరవడం గమనార్హం. దీనిపై ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకుంటుందనేది ఇంకా తెలియరాలేదు.

Also Read:

AP PGECET 2022: ఏపీ పీజీఈసెట్‌-2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు