AP PGECET 2022: ఏపీ పీజీఈసెట్‌-2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP PGECET 2022) దరఖాస్తు ప్రక్రియ బుధవారం (మే 11) నుంచి ప్రారంభమయ్యింది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ M.Tech/M.Pharmacy/Pharma.D కోర్సుల్లో ప్రవేశాలకు..

AP PGECET 2022: ఏపీ పీజీఈసెట్‌-2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..
Ap Pgecet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: May 12, 2022 | 8:48 AM

AP PGECET 2022 Exam date: ఆంధ్రప్రదేశ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP PGECET 2022) దరఖాస్తు ప్రక్రియ బుధవారం (మే 11) నుంచి ప్రారంభమయ్యింది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ M.Tech/M.Pharmacy/Pharma.D కోర్సుల్లో ప్రవేశాలకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో cets.apsche.ap.gov.in.లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.1200, వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్ధులు రూ.900, ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.700లు దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.

ఇక ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూన్ 14 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. రూ.5000ల ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ పీజీఈసెట్‌ పరీక్ష జూలై 18 నుంచి జూలై 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు షిఫ్టుల ప్రకారంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుంది.

Also Read:

IIT Bombay: UCEED ప్రవేశ పరీక్షలో మార్పులు.. కొత్త సిలబస్‌ రూపకల్పన!