IIT Bombay: UCEED ప్రవేశ పరీక్షలో మార్పులు.. కొత్త సిలబస్ రూపకల్పన!
ఐఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు ఫర్ డిజైన్ (UCEED) సిలబస్ మారనుంది. కొత్త సిలబస్ ప్రకారమే..
IITs Change Syllabus, Paper Pattern for Design Entrance Exam: ఐఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు ఫర్ డిజైన్ (UCEED) సిలబస్ మారనుంది. కొత్త సిలబస్ ప్రకారమే 2024 నుంచి ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈ మేరకు ఐఐటీ బొంబాయి నూతన సిలబస్‌తోపాటు పరీక్ష కొత్త విధానాన్ని ప్రకటించింది. పరీక్షలో ఎ, బి విభాగాలు ఉంటాయి. ‘పార్ట్-ఎ’లో ఎటువంటి మార్పులు లేవు. ‘పార్ట్-బి’ పరీక్షకు ఇప్పటివరకు 30 నిమిషాల సమయం ఇవ్వగా… కొత్త విధానంలో కొన్ని అదనపు అంశాలను జోడించి పరీక్ష సమయాన్ని 60 నిమిషాలకు పెంచారు. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులు ఐఐటీ హైదరాబాద్‌తోపాటు ఐఐటీ బొంబాయి, దిల్లీ, గువాహటి, జబల్‌పూర్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మాస్టర్ ఆఫ్ డిజైన్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ డిజైన్(సీడ్)కు కూడా కొత్త సిలబస్‌ను రూపొందించారు.
Also Read: