NEET: నీట్ -2022 ను రీ షెడ్యూల్ చేయండి.. కేంద్రమంత్రికి ఐఎమ్ఏ లేఖ

మే 21 న జరగాల్సిన నీట్ - 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ.. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయా కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) లేఖ రాసింది. గతేడాది జరిగిన నీట్- 2021 పరీక్ష ఐదు నెలల...

NEET: నీట్ -2022 ను రీ షెడ్యూల్ చేయండి.. కేంద్రమంత్రికి ఐఎమ్ఏ లేఖ
Neet
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 12, 2022 | 10:21 AM

మే 21 న జరగాల్సిన నీట్ – 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ.. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయా కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) లేఖ రాసింది. గతేడాది జరిగిన నీట్- 2021 పరీక్ష ఐదు నెలల ఆలస్యంతో సెప్టెంబర్ 2021 న నిర్వహించారని లేఖలో పేర్కొంది. అక్టోబరులో ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ కూడా ఆలస్యంగా జనవరిలో ప్రారంభమైందని లేఖలో వెల్లడించింది. ఆలస్యమైన కౌన్సెలింగ్ షెడ్యూల్ తో ఏప్రిల్ లో జరగాల్సిన నీట్ పీజీ- 2022 మే నెలకు వాయిదా పడింది. దీంతో ఈ సంవత్సరం సీటు పొందలేకపోతే విద్యార్థులకు కష్టతరమవుతుందని తెలిపింది. మరోవైపు.. మే 21 న నిర్వహిస్తున్న నీట్-2022(NEET) ను వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది నీట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్ కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాశారు. గతేడాది నీట్ పరీక్ష నిర్వహించడంలో జాప్యం జరిగిందని, సెప్టెంబరు 2021లో ప్రవేశ పరీక్ష నిర్వహించారని లేఖలో తెలిపారు. ఈ ఆలస్యం కారణంగా అభ్యర్థులు వారి కెరీర్‌లో ఒక సంవత్సరం కోల్పోయారని చెప్పారు. ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్ వస్తున్నా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

మెడికల్ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ పీజీ – 2022 మాత్రం మే 21న నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. శనివారం జరిగిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా హాజరైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ పీజీ – 2021 పరీక్ష, కౌన్సెలింగ్ ప్రక్రియ రెండూ ఆలస్యమైనందున ఈ సారి సరైన విధానంలో ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతేడాది కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో.. రాబోయే నీట్ పీజీ – 2022 పరీక్షకు సిద్ధం కావడానికి తగిన సమయం లేదని దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్థులు అంటున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

500 Rupee Note: అలా ఉంటే అది నకిలీ నోటా.. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ..

రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!

Philippines: ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా నియంత కుమారుడు.. జూనియర్‌ మార్కోస్‌ ఘన విజయం..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..