AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FCI Recruitment 2022: 8,టెన్త్/డిగ్రీ అర్హతతో.. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 4710 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FCI).. కేటగిరీ II, III, IVలో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల (Assistant General Manager Posts) భర్తీకి అర్హులైన ..

FCI Recruitment 2022: 8,టెన్త్/డిగ్రీ అర్హతతో.. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 4710 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..
Fci
Srilakshmi C
|

Updated on: May 12, 2022 | 10:52 AM

Share

FCI Grade II, III and IV Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FCI).. కేటగిరీ II, III, IVలో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల (Assistant General Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4710

ఖాళీల వివరాలు:

  • కేటగిరీ II పోస్టులు: 35
  • కేటగిరీ III పోస్టులు: 2521
  • కేటగిరీ IV పోస్టులు: 2154

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.50,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి 8వ తరగతి, పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్ లేదా బీకాం, ఎమ్‌బీఏ, సివిల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీకింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజనీరింగ్‌ లేదా సివిల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌లోడిప్లొమా చేసి ఉండాలి. అలాగే స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.1000
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ త్వరలో ప్రకటించనుంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

10th exams 2022: ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 43,489 మంది విద్యార్ధులు గైర్హాజరు.. సుమోటో విచారణకు ఉత్తర్వులు!