AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter Exams 2022: యథావిధిగా ఏపీ ఇంటర్ పరీక్షలు.. ఆ వదంతుల్ని నమ్మొద్దు! మే 13 నుంచి మూల్యంకనం..

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారం (మే 12) నుంచి యథావిధిగా కొనసాగుతాయని ఇంటర్‌ బోర్డు (BIEAP) సెక్రటరీ శేషగిరిబాబు..

AP Inter Exams 2022: యథావిధిగా ఏపీ ఇంటర్ పరీక్షలు.. ఆ వదంతుల్ని నమ్మొద్దు! మే 13 నుంచి మూల్యంకనం..
Nter Supplementary Exams
Srilakshmi C
|

Updated on: May 12, 2022 | 12:11 PM

Share

AP inter exams 2022 latest news: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారం (మే 12) నుంచి యథావిధిగా కొనసాగుతాయని ఇంటర్‌ బోర్డు (BIEAP) సెక్రటరీ శేషగిరిబాబు మీడియాకు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు కథనాలు, వదంతులను నమ్మవద్దన్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ (AP inter exams 202 schedule) ప్రకారం గురువారం ఇంటర్ సెకండియర్‌ మ్యాథ్స్‌, వృక్ష శాస్త్రం, పౌర శాస్త్రం పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా బుధవారం జరగవలసిన ఇంరట్ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను అసని తుపాను కారణంగా మే 25కు వాయిదా వేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. మే 11న జరగవల్సిన మ్యాథ్స్‌, వృక్ష శాస్త్రం, పౌర శాస్త్రం పరీక్షలను అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత మే 25న నిర్వహిస్తామని ప్రకటించింది. ఇక పరీక్ష సమయాలు, కేంద్రాల్లో కూడా ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. వీటితోపాటు బుధవారం జరగవల్సిన ఎంబీబీఎస్‌, ఎంపీటీ థియరీ పరీక్షలను కూడా ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ వాయిదావేసింది.

మే 13 నుంచి ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ఏపీ ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం మే 13 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. మూల్యాంకనం ప్రక్రియ 4 విడతలుగా చేపట్టనున్నారు. ఇంటర్ ఫలితాలు జూన్‌లో వెల్లడించనున్నారు.

Also Read:

TSSPDCL JACO Result 2022: తెలంగాణ విద్యుత్‌ శాఖ జేఏసీఓ మెరిట్ జాబితా విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..