TSPSC AEE Exam: తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) రాత పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Jan 17, 2023 | 12:31 PM

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్‌ సర్వీసుల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్‌ టికెట్లను కమిషన్‌..

TSPSC AEE Exam: తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) రాత పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల
TSPSC AEE Hall Tickets

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్‌ సర్వీసుల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి జ‌న‌వ‌రి 22న రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన హాల్‌ టికెట్లను కమిషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తెలిపారు.

మొత్తం రెండు షిప్టుల్లో జరిగే ఈ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల వరకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో పేపర్‌ పరీక్షలు జరుగుతాయి. నవరంబర్‌ 22న ఉదయం పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు వరకు హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయని అనితా రామచంద్రన్‌ వివరించారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu