TSLPRB: డిసెంబర్‌ మొదటివారంలోనే ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు శారీరక సామర్థ్య పరీక్షలు.. 12 కేంద్రాలు ఏర్పాటు..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Nov 16, 2022 | 8:47 AM

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహించడానికి ముహూర్తం ఖరారైంది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్ధుల నిరీక్షణకు తెర దించినట్లైంది. ఎంపిక ప్రక్రియలో..

TSLPRB: డిసెంబర్‌ మొదటివారంలోనే ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు శారీరక సామర్థ్య పరీక్షలు.. 12 కేంద్రాలు ఏర్పాటు..
physical fitness tests for SI and Constable Posts

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహించడానికి ముహూర్తం ఖరారైంది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్ధుల నిరీక్షణకు తెర దించినట్లైంది. ఎంపిక ప్రక్రియలో భాగమైన ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ) వంటి పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో డిసెంబరు మొదటి వారంలో నిర్వహించేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఒక్కో మైదానంలో సగటున 130 మంది సిబ్బంది పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. కుదిరితే నవంబర్‌ చివరి వారంలోనే ఈ పరీక్షలు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

ఐతే ఈ సారి పోస్టులన్నింటికి శారీరక సామర్థ్య పరీక్షలను ఒకేసారి నిర్వహించాలని కీలక మార్పులు చేశారు. దీంతో ఒకసారి అర్హత సాధిస్తే, ఆ ఫలితాల్ని మూడు నెలలపాటు పరిగణనలోకి తీసుకోనున్నట్లు బోర్డు ప్రకటించింది. గతంలోనైతే ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు పోటీ పడితే ఆన్నిసార్లు శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరు కావల్సి ఉండేది. ఇక ఈ పరీక్షలన్నింటినీ మొదలు పెట్టిననాటి నుంచి సరిగ్గా 25 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. శారీరక సామర్ధ్య పరీక్షల అనంతరం మెయిన్స్‌ (రాతపరీక్ష) నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. .

ఇవి కూడా చదవండి

పరీక్ష కేంద్రాలు ఇవే..

 • యూనిట్‌ – మైదానం
 • హైదరాబాద్‌ – ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ అంబర్‌పేట
 • సైబరాబాద్‌ – 8వ బెటాలియన్‌ కొండాపూర్‌
 • రాచకొండ – సరూర్‌నగర్‌ స్టేడియం
 • సంగారెడ్డి – పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌
 • సిద్దిపేట – పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌
 • కరీంనగర్‌ – సిటీపోలీస్‌ శిక్షణ కేంద్రం
 • ఆదిలాబాద్‌ – పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌
 • నిజామాబాద్‌ – రాజారాం స్టేడియం, నాగారం (నిజామాబాద్‌)
 • మహబూబ్‌నగర్‌ – డిస్ట్రిక్ట్‌ స్టేడియం స్పోర్ట్స్‌ గ్రౌండ్‌
 • వరంగల్‌ – హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం
 • ఖమ్మం – పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌
 • నల్గొండ – మేకల అభినవ్‌ స్టేడియం

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu