TS EAMCET 2021: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. టీఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు మళ్లీ పొడిగింపు..
TS EAMCET 2021 application date: కరోనావైరస్ సెకండ్ వేవ్ అంతటా విజృంభిస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పరీక్షలతో పాటు
TS EAMCET 2021 application date: కరోనావైరస్ సెకండ్ వేవ్ అంతటా విజృంభిస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పరీక్షలతో పాటు పలు సెట్‌లను వాయిదా వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ఎంసెట్ 2021 దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 24 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ గురువారం వెల్లడించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా.. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ వెల్లడించారు. కాగా తెలంగాణ ఎంసెట్ పరీక్షను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జెఎన్‌టీయూ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ పరీక్ష దరఖాస్తు గడువు మే 18న ముగియాల్సి ఉండగా.. ఇప్పటికీ నాలుగుసార్లు పొడిగించగా.. మరలా.. జూన్ 24 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్ ఆధారంగా జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో నిర్వహించనున్నటల్లు అధికారులు అంతకుముందు వెల్లడించిన విషయం తెలిసిందే. అగ్రికల్చర్ వారికి 3, ఇంజినీరింగ్ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించనున్నట్లు జెఎన్‌టీయూ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ.. మరలా తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Also Read: