Success Story: ఇది కదరా సక్సెస్ అంటే.. ఆరు అంకెల జీతాన్ని వదిలుకుని చిన్నపిల్లాడికి దూరమైనా ఐఏఎస్ సాధించిందిగా..!
ఐఏఎస్ అధికారి కావాలనే తన కలను సాకారం చేసుకోవాలనే పట్టుదలకు, త్యాగానికి అను కుమారి ప్రయాణమే నిదర్శనం. ఆమె కథ వ్యక్తిగత, వృత్తిపరమైన ఆకాంక్షలను సమతుల్యం చేయడానికి ప్రయత్నించే వ్యక్తులు అంటే మరీ ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా ఉంటుంది. అయితే అనుకుమారి ఐఏఎస్ జర్నీలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొందో? ఓ సారి తెలుసుకుందాం.

ప్రభుత్వ ఉద్యోగం అనేది చదువుకున్న ప్రతి వ్యక్తి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి ఎంతటి కష్టమైన పడడానికి పూనుకుంటారు. కొంతమంది నలుగురు వెళ్లే దారిలో కాకుండా కొత్తగా వెళ్ధామనే ఉద్దేశంతో కొంతమంది కష్టమైనా ఐఏఎస్ కావాలని పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటారు. ఐఏఎస్ అధికారి కావాలనే తన కలను సాకారం చేసుకోవాలనే పట్టుదలకు, త్యాగానికి అను కుమారి ప్రయాణమే నిదర్శనం. ఆమె కథ వ్యక్తిగత, వృత్తిపరమైన ఆకాంక్షలను సమతుల్యం చేయడానికి ప్రయత్నించే వ్యక్తులు అంటే మరీ ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా ఉంటుంది. అయితే అనుకుమారి ఐఏఎస్ జర్నీలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొందో? ఓ సారి తెలుసుకుందాం.
అనుకుమారి ఫిజిక్స్‌లో గ్రాడ్యూమేషన్ సాధించిన తరువాత ఫైనాన్స్, మార్కెటింగ్‌లో ఎంబీఏ అభ్యసించింది. చదువకు తగినట్లు ప్రైవేట్ రంగంలో విజయవంతంగా అయినప్పటికీ, సమాజానికి మరింత సహకారం అందించాలనే కోరికతో సివిల్ సర్వీసెస్ వైపు ఆమె అడుగులు పడ్డాయి. ముఖ్యంగా ఎంతో ధైర్యంగా అధిక జీతం ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టింఇ. యూపీఎస్‌సీ పరీక్ష సన్నద్ధతకు తనను తాను పూర్తిగా అంకితం చేసుకోవడం కోసం ఆమె తన పసిబిడ్డకు కూడా దూరంగా ఉంది. ఈ నిర్ణయం మానసికంగా ఆందోళన కలిగించినప్పటికీ ఐఏఎస్ కావాలనే తన కల ముందు ఇవన్నీ చిన్నగానే అనిపించాయి.
యూపీఎస్‌సీ పరీక్షలో తన మొదటి ప్రయత్నంలో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ అను కుమారి పట్టుదలతో పోరాడి చివరికి యూపీఎస్ పరీక్షలో ఆకట్టుకునే ఆల్ ఇండియా రెండో ర్యాంక్ సాధించింది. ఆమె కృషి, సంకల్పం, త్యాగాలు ఫలించడంతో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా అనుకుమారి నిలిచింది. అను విజయం ఆమె వ్యక్తిగత విజయాన్ని ప్రతిబింబించడమే కాకుండా ప్రజా సేవ ద్వారా సానుకూల ప్రభావం చూపాలని ఆకాంక్షించే అనేక మంది వ్యక్తులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
మరిన్ని తాజా విద్యా ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.







