AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE: 9వ తరగతి టెక్ట్స్‌ బుక్‌లో డేటింగ్‌ అంశాలు.. అసలు నిజం ఏంటంటే..

వివరాల్లోకి వెళితే.. గత కొన్నిరోజులుగా సీబీఎస్‌ఈ సిలబస్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. దీని ప్రకారం సీబీఎస్‌ఈ 9వ తరగతి పాఠ్యపుస్తకంలో డేటింగ్‌, లవ్‌, రిలేషన్‌కు సంబంధించిన విషయాలను ప్రచురించారు అంటూ ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఇందులో గోస్టింగ్, క్యాట్ ఫిషింగ్, సైబర్ బెదిరింపులు వంటి వాటిని వివరించేలా...

CBSE: 9వ తరగతి టెక్ట్స్‌ బుక్‌లో డేటింగ్‌ అంశాలు.. అసలు నిజం ఏంటంటే..
CBSE
Narender Vaitla
|

Updated on: Feb 05, 2024 | 4:33 PM

Share

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచార విప్లవం వచ్చింది. క్షణాల్లో సమాచారం ఒక చోటు నుంచి మరో చోటుకి చేరుతుంది. అయితే ఇదే సమయంలో షేక్‌ సమాచారం కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది. మార్ఫింగ్‌ లేదా తప్పుడు సమాచారాన్ని నెట్టింట వైరల్ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే మొన్నటి వరకు ఇది కేవలం సినీ, రాజకీయ రంగాలకు మాత్రమే పరిమితం అనుకున్నాం కానీ తాజాగా విద్యా రంగంలోనూ ఇలాంటి ఓ ఫేక్‌ న్యూస్‌ వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. గత కొన్నిరోజులుగా సీబీఎస్‌ఈ సిలబస్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. దీని ప్రకారం సీబీఎస్‌ఈ 9వ తరగతి పాఠ్యపుస్తకంలో డేటింగ్‌, లవ్‌, రిలేషన్‌కు సంబంధించిన విషయాలను ప్రచురించారు అంటూ ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఇందులో గోస్టింగ్, క్యాట్ ఫిషింగ్, సైబర్ బెదిరింపులు వంటి వాటిని వివరించేలా ఉన్నాయని అంటూ కొన్ని కథనాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని మీడియా సంస్థలు సైతం వార్తలను ప్రచురించాయి.

అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని, ఇది పూర్తిగా ఫేక్‌ న్యూస్‌ అని సీబీఎస్‌ఈ తేల్చి చెప్పింది. సీబీఎస్‌ఈ హెచ్‌క్యూ అనే ట్విట్టర్‌ హాండిల్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ‘సీబీఎస్‌ఈ 9వ తరగతి పాఠ్య పుస్తకంలో డేటింగ్‌కు సంబంధించిన వివరాలను ప్రస్తావిస్తూ పాఠ్యాంశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇవి పూర్తిగా నిరాధారమైనవి. ఇందులో ఏమాత్రం నిజం లేదు.

నిజానికి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఆ ఫొటోలు.. గగన్‌ దీప్‌ కౌర్‌ అనే రచయిత రాసి.. ‘ఏ గైడ్ టు సెల్ఫ్‌ అవార్‌నెస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్’ అనే పుస్తకంలోనివి. ఈ పుస్తకాన్ని జీ రామ్‌ బుక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎడ్యుకేషనల్‌ పబ్లిషర్స్‌ ప్రచురించారు. సీబీఎస్‌ఈ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీ పబ్లిషర్స్‌ వద్ద పుస్తకాలను ప్రచురించవు’ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్త తప్పుడు సమాచారమని తేలిపోయింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?