ప్రపంచంలో టఫ్ ఎగ్జామ్ ఏంటో తెలుసా.? ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర
ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసే ఎన్నో ఆసక్తికర అంశాలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంటారీ బిజినెన్ మ్యాన్. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్ మహీంద్ర 12th ఫెయిల్ అనే సినిమాను చూశారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు...

ఆనంద్ మహీంద్ర.. సోషల్ మీడియాపై ఏమాత్రం అవగాహన ఉన్న వారికైనా ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మహీంద్ర గ్రూప్ ఛైర్మన్, దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ మహీంద్ర. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్ వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన వీడియోలు, విషయాలను షేర్ చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు.
ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసే ఎన్నో ఆసక్తికర అంశాలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంటారీ బిజినెన్ మ్యాన్. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్ మహీంద్ర 12th ఫెయిల్ అనే సినిమాను చూశారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ’12th ఫెయిల్ సినిమా చూసిన తర్వాత నా చుట్టూ ఉన్న చాలా మంది యువతను అత్యంత కఠినమైన పరీక్ష ఏంటో అడిగాను. ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఓ విద్యార్థి.. బదులిస్తూ, ఐఐటీ జేఈఈ కంటే యూపీఎస్‌సీ పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది అని తెలిపారు’ అని రాసుకొచ్చారు.
అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఆనంద్ మహీంద్రకు అసలు ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్ష ఏంటన్న వివరాలను ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ‘ది వరల్డ్ ర్యాంకింగ్’ రూపొందించిన ఒక లిస్ట్ పోస్ట్ చేశారు. ఈ పోస్టు ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా చైనాలో నిర్వహించే ‘గావోకో పరీక్ష’ అని ఉంది. ఆ తర్వాత భారత్‌లో నిర్వహించే ఐఐటీ, జేఈఈ, యూపీఎస్‌సీ పరీక్షలు ఉన్నాయి.
ఆనంద్ మహీంద్ర ట్వీట్..
💡 Which exam is the toughest?
Top Toughest Exams in the World
1. 🇨🇳 China → Gaokao Exam 2. 🇮🇳 India → IIT JEE Exam 3. 🇮🇳 India → UPSC Exam 4. 🏴 England → Mensa 5. 🇺🇸🇨🇦 US/Canada → GRE 6. 🇺🇸🇨🇦 US/Canada → CFA 7. 🇺🇸 US → CCIE 8. 🇮🇳 India → GATE 9. 🇺🇸 US → USMLE 10. 🇺🇸…
— The World Ranking (@worldranking_) October 26, 2023
ఇక నాల్గవ స్థానంలో ఇంగ్లండ్‌లో నిర్వహించే ‘మీనస’ పరీక్ష ఉండగా, అమెరికా/కెనడా దేశాలకు సంబంధించి నిర్వహించే జీఆర్‌ఈ, సీఎఫ్‌ఏ పరీక్షలు ఉన్నాయి. భారత్‌లో నిర్వహించే మరో పరీక్ష గేట్ 8వ స్థానంలో ఉండగా, అమెరికాలో నిర్వహించే యూఎస్ఎమ్‌ఎల్ఈ, కాలిఫోర్నియా బార్ ఎగ్జామ్ ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షల టాప్ 10 జాబితాలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
