Online Classes: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యా సంవత్సరం నష్ట పోకూడదనే ఉద్దేశంతో..
Online Classes: కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి సెలవులను జనవరి 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా స్కూళ్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది...
Online Classes: కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి సెలవులను జనవరి 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ స్కూళ్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. 8,9,10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వాహిచాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇక ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో 50 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాఠశాలలకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు. విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆన్‌లైన్ క్లాసులకు సర్కారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే పొడగించిన సంక్రాంతి సెలవుల్లో జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. అయితే తాజాగా పాఠశాల విద్యా విభాగం ఆన్‌లైన్ క్లాసుల వైపు మొగ్గు చూపింది. మరి ఇంటర్ తరగతుల విషయంలో బోర్డ్ ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి. ఇక కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే. విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో సిలబస్‌ను 70 శాతానికి తగ్గించారు.
Also Read: Harish Shankar : ‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి పిండేశావ్’.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్
Priyamani: సెకండ్ ఇన్నింగ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ‘ప్రియమణి’ ఆకట్టుకుంటున్న ఫొటోస్…
Telangana: అక్కడ జీలుగు కల్లుకు యమ డిమాండ్.. ఏకంగా సీసా రూ.500.. ముందు బుక్ చేసుకుంటేనే