TGPSC Group 1 Mains: టీ-శాట్‌లో గ్రూప్-1 మెయిన్స్ పాఠాలు ప్రసారం.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్ధులు పోటాపోటీగా సిద్ధమవుతున్నారు. కొందరు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటే.. మరికొందరేమో ఇంటి వద్దనే ప్రపరేషన్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాసే టీ-శాట్ గుడ్‌న్యూస్ చెప్పింది. వేలకి వేలు డబ్బులు వెచ్చించి కోచింగ్‌లు తీసుకోలేని అభ్యర్థులకు టీ-శాట్ ప్రత్యేక పాఠాలను ప్రసారం చేయనుంది. గతంలోనూ ప్రిలిమ్స్ పరీక్షకు ముందు టీ-శాట్ అవగాహన..
హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్ధులు పోటాపోటీగా సిద్ధమవుతున్నారు. కొందరు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటే.. మరికొందరేమో ఇంటి వద్దనే ప్రపరేషన్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాసే టీ-శాట్ గుడ్‌న్యూస్ చెప్పింది. వేలకి వేలు డబ్బులు వెచ్చించి కోచింగ్‌లు తీసుకోలేని అభ్యర్థులకు టీ-శాట్ ప్రత్యేక పాఠాలను ప్రసారం చేయనుంది. గతంలోనూ ప్రిలిమ్స్ పరీక్షకు ముందు టీ-శాట్ అవగాహన పాఠ్యాంశాలు అందించించింది. మెయిన్స్ పరీక్షకు కూడా అభ్యర్ధులకు పాఠాలు బోధించేందుకు 750 ఎపిసోడ్‌లను సిద్ధం చేసిందని టీ-శాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీశాట్ పాఠాలు ఆగస్టు 6 నుంచి ప్రారంభమయ్యాయి. అక్టోబరు 19 వరకు ప్రతి రోజూ ఆయా అంశాలపై ప్రసారం చేసేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
అరగంట నిడివిగల పాఠ్యాంశాలను రోజుకు ఐదు గంటల చొప్పున ప్రసారం చేస్తున్నారు. 10 ఎపిసోడ్స్ 75 రోజులు టీ-శాట్ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రసారం చేయనున్నట్లు టీ-శాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. టీ-శాట్ నిపుణ ఛానల్‌లో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారం చేస్తారు. మళ్లీ అవే ప్రసారాలను మరుసటి రోజు ఉదయం 5 నుంచి 10 గంటల వరకు విద్య ఛానల్‌లో ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గ్రూప్ 1 అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కాగా మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. జూన్ 9న 31 జిల్లాల్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో 1:50 నిష్పత్తి ప్రకారమే అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేశారు. మొత్తం 31,382 మెయిన్స్‌కు ఎంపికయ్యారు. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు పాత 10 జిల్లాల వారీగా నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.