Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC AE 2024 Selection List: టీజీపీఎస్సీ ఏఈ తుది జాబితా వెల్లడి.. మొత్తం ఎంత మందిని సెలక్ట్ చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్‌ ఆఫీసర్, సూపర్‌వైజర్‌ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను కమిషన్‌ వెల్లడించింది. ఈ కింద పూర్తి లిస్ట్‌ చెక్‌ చేసుకోవచ్చు..

TGPSC AE 2024 Selection List: టీజీపీఎస్సీ ఏఈ తుది జాబితా వెల్లడి.. మొత్తం ఎంత మందిని సెలక్ట్ చేశారంటే?
TGPSC AE 2024 Selection List
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2025 | 7:00 AM

హైదరాబాద్‌, జనవరి 26: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల్లో సివిల్‌ కేటగిరీ కింద అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్‌ ఆఫీసర్, సూపర్‌వైజర్‌ పోస్టులకు మొత్తం 650 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంపికైన 650 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీజీపీఎస్సీ తాజాగా వెల్లడించింది. ఈ పోస్టులకు రాత పరీక్షలు అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడు దశల వారీగా ధ్రువీకరణ పత్రాల పరిశీలించిన కమిషన్‌.. తాజాగా జాబితా విడుదల చేసింది. పూరి జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కమిషన్‌ కార్యదర్శి డాక్టర్‌ నవీన్‌నికోలస్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

టీజీపీఎస్సీ ఏఈ తుది జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ జీడీ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల.. ఫిబ్రవరి 4 నుంచి రాత పరీక్షలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కానిస్టేబుల్‌, రైఫిల్‌మ్యాన్‌ జీడీ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలకు త్వరలోనే హాల్‌ టికెట్లు విడుదల కానున్నాయి. ఈక్రమంలో తాజాగా కమిషన్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులు భర్తీ కానున్నాయి. ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఆన్ లైన్ విధానంలో రాత పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నాలుగు రోజుల్లో అందుబాటులోకి వస్తాయి.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి17 నుంచి నాగార్జున యూనివర్సిటీ బీఫార్మసీ పరీక్షలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ కాలేజీల్లో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేశారు. నాలుగో ఏడాదిలో ఏడో సెమిస్టర్, మూడో ఏడాదిలో ఐదో సెమిస్టర్, ఆరో సెమిస్టర్‌ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 17వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు సీఈ శివప్రసాదరావు ఓ ప్రటనలో చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి 3వ తేదీలోపు పరీక్షల ఫీజులు చెల్లించాలని సీఈ తెలిపారు. రూ.100 ఆలస్యం రుసుంతో ఫిబ్రవరి 4లోపు ఫీజు చెల్లించవచ్చన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.