AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSLPRB APP Notification 2025: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. 118 పోస్టులకు మరో నోటిఫికేషన్‌ విడుదల! నెలకు రూ.లక్షన్నర జీతం

TGLPRB APP Recruitment 2025 Notification: రాష్ట్రంలోని ప్రాసిక్యూషన్ సర్వీస్ (కేటగిరీ-6) విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం..

TSLPRB APP Notification 2025: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. 118 పోస్టులకు మరో నోటిఫికేషన్‌ విడుదల! నెలకు రూ.లక్షన్నర జీతం
TSLPRB Assistant Public Prosecutor Jobs
Srilakshmi C
|

Updated on: Sep 05, 2025 | 1:25 PM

Share

తెలంగాణ రాష్ట్రంలోని ప్రాసిక్యూషన్ సర్వీస్ (కేటగిరీ-6) విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 118 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్దులు సెప్టెంబర్‌ 12 ఉదయం 8గంటల నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

పోస్టుల వివరాలు ఇవే..

  • మల్టీ జోన్ 1లో పోస్టుల సంఖ్య: 50 పోస్టులు (ఇందులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ద్వారా 38, బ్యాక్‌లాగ్‌ కింద 12 పోస్టులు ఉన్నాయి)
  • మల్టీ జోన్ 2లో పోస్టుల సంఖ్య: 68 పోస్టులు (ఇందులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ద్వారా 57, కింద 11 పోస్టులు ఉన్నాయి)

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా బాచిలర్ డిగ్రీతో పాటు LLB/BL లా డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3 ఏళ్ల పాటు ప్రాక్టీసింగ్ అడ్వకేట్‌గా అనుభవం ఉండాలి. అంతేకాకుండా ఈ ప్రకటన విడుదలైన తేదీ నాటికి ప్రాక్టీసింగ్ అడ్వకేట్‌గా కొనసాగుతూ ఉండాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుల వయోపరిమితి 01 జూలై 2025 నాటికి 34 సంవత్సరాలకు మించకూడదు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఐదేళ్లు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్స్‌ అభ్యర్దులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్ధులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 5, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు సెప్టెంబర్‌ 12, 2025 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు జీతంగా చెల్లిస్తారు.

రాతపరీక్ష ఎలా ఉంటుందంటే..

రాతపరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్ 1లో 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక పేపర్ 2 డిస్క్రిప్టివ్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..