Telangana: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. లాసెట్, పీజీఎల్‌సెట్, ఈసెట్ పరీక్షలు ఎప్పుడంటే..
తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ తో పాటు ఈసెట్ పరీక్షల నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను ఉన్నత విద్యా మండలి సోమవారం విడుదల చేసింది.. జూన్ 6 లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు జరగనుండగా.. మే 12 న ఈ సెట్ ఎగ్జామ్ జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకోండి..

తెలంగాణ లా సెట్, పీజీఎల్ సెట్ లకు మంగళవారం (25 ఫిబ్రవరి 2025) నోటిఫికేషన్ విడుదల కానుంది.. తర్వాత మార్చి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 15 వరకు ఎలాంటి ఫైన్ రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 25 వరకు 500 రూపాయల జరిమానాతో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 5 వరకు రూ. 1000 జరిమానా, మే 15 వరకు రూ.2000, మే 25 వరకు 4000 రూపాయల జరిమానా తో అప్లికేషన్స్ స్వీకరించనున్నారు.. మే 20 నుంచి మే 25 వరకు దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నారు. మే 30న పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు.
జూన్ 6 లాసెట్, పీజీ ఎల్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 3 ఇయర్స్ లా కోర్స్ కోసం లాసెట్ పరీక్షలు.. మధ్యాహ్నం తర్వాత ఫైవ్ ఇయర్స్ లా కోర్సులతో పాటు పిజిఎల్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
జూన్ 10 న ప్రిలిమినరీ కీ, 14 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. సుమారుగా జూన్ 25 న ఫైనల్ కీ తో పాటు ఫలితాలు విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి సన్నాహకాలు చేస్తోంది..
తెలంగాణ ఈసెట్..
తెలంగాణ ఈసెట్ కు సంబంధించి కూడా నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది.. మార్చి 3 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 19 వరకు అప్లికేషన్స్ స్వీకరించనున్నారు.
మే 12 న ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ మేరకు మంగళవారం విడుదల అధికారిక నోటిఫికేషన్లు వివరాలను దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గమనించాలని ఉన్నత విద్యా మండలి సూచించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
