Telangana: ‘డిగ్రీ మూడేళ్లు కాదు నాలుగేళ్లు’.. డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పుల దిశగా ఉన్నత విద్యామండలి కసరత్తులు
డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక మీదట నాలుగేళ్లు. ఇంతకీ ఎక్కడిదీ విధానం? ఆ మార్పు చేర్పులు ఎలా ఉండబోతున్నాయ్? ఆ వివరాలు మీకోసం..
తెలంగాణ డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక మీదట నాలుగేళ్లు. ఇంతకీ ఎక్కడిదీ విధానం? ఆ మార్పు చేర్పులు ఎలా ఉండబోతున్నాయ్? ఆ వివరాలు మీకోసం.. డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) నిర్ణయించింది. మూస పద్ధతికి స్వస్తి చెప్పి.. ఎగ్జామినేషన్, ఎవాల్యుయేషన్, అసెస్మెంట్‌లలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం రూప కల్పన బాధ్యతలను ఐఎస్బీకి అప్పగించింది. ఈ మేరకు నిన్న ISB, యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశమైంది. ప్రస్తుత పద్ధతులు, తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. పరీక్ష విధానంలో మార్పులు విద్యార్థి హితంగా ఉండాలని నిర్ణయించారు.
కాలేజీల్లో వసతులు పెంచాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 30లోపు రిపోర్టు ఇవ్వాలని ISB కి ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు అమలు చేయాలని చెప్పింది. పెన్ అండ్ పేపర్ విధానానికి ప్రాధాన్యత తగ్గించాలని చెప్పింది. విద్యార్థికి ఉద్యోగం వచ్చే విధంగా.. ఎంపవర్ మెంట్ సాధించే విధంగా పరీక్షా విధానం ఉండాలని నిర్ణయించింది. డిగ్రీ సిలబస్ ను పూర్తిగా మార్చి.. లాంగ్వేజ్లలోనూ ప్రాక్టికల్స్ పెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో 4.60 లక్షల సీట్లుండగా అందులో ఏటా సగటున 2 లక్షల మంది చదువుతున్నారు. అయితే డిగ్రీ ఉత్తీర్ణుల్లో కనీసం 10 శాతం మంది కూడా నైపుణ్య ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మొత్తం మీద 40 శాతం మంది మాత్రమే ఏదో ఒక ఉద్యోగంలో చేరుతున్నారు. మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వారిలో నైపుణ్యం ఉండటం లేదని, పారిశ్రామిక అవసరాలు, వృత్తి నిపుణులకు మధ్య అంతరం ఉందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. డిగ్రీ పరీక్ష విధానంలోనే మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సూచించాయి. ఈ నేపథ్యంలోనే ఐఎస్‌బీ ఉన్నత విద్యలో పరీక్ష విధానాన్ని పరిశీలించనుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.