OU: వారంలో ఉస్మానియా యూవర్సిటీలో సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ ఏర్పాటు.. జనవరి నుంచి తరగతులు..

తెలంగాణలోని ఉస్మానియా యూవర్సిటీలో సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ ప్రారంభానికి రంగం సిద్ధం చేసింది. మరో వారం రోజుల్లో చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ చేతులమీదుగా ప్రారంభించేందుకు..

OU: వారంలో ఉస్మానియా యూవర్సిటీలో సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ ఏర్పాటు.. జనవరి నుంచి తరగతులు..
Civil Services Training Academy at OU
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 13, 2022 | 7:19 AM

తెలంగాణలోని ఉస్మానియా యూవర్సిటీలో సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ ప్రారంభానికి రంగం సిద్ధం చేసింది. మరో వారం రోజుల్లో చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ చేతులమీదుగా ప్రారంభించేందుకు వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2021 మేలో ఓయూ నూతన వీసీగా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్‌ డి రవీందర్‌ తెరపైకి తెచ్చిన 21 అంశాల అజెండాలో.. సివిల్‌ సర్వీసెస్‌ ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటు ఒకటి. దీనికోసం ప్రత్యేకంగా ఓ భవనాన్ని కేటాయించి అందులో శిక్షణ ఇవ్వాలని అప్పట్లో ఆయన నిర్ణయించారు.

ఇప్పటికే సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ ఏర్పాటు చేసి ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ చింతా గణేశ్‌ను డైరెక్టర్‌గా నియమించారు. రూ.2 కోట్ల వ్యయంతో సెంట్రల్‌ వర్క్‌షాపు భవనానికి మరమ్మత్తులు చేసి 1000 మంది చదువుకొవడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

ఈ సివిల్స్‌ అకాడమిలో ట్రైనింగ్‌ ఇచ్చేందుకు ముందుగా విద్యార్ధులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. క్యాంపస్‌ విద్యార్ధులేకాకుండా అనుబంధ కాలేజీల విద్యార్థులు కూడా ఇక్కడ శిక్షణ తీసుకోవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి అవసరమైన పుస్తకాలు అకాడమిలోనే అందుబాటులో ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది (2023) జూన్‌లో జరగనున్న సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు జనవరి నుంచి తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ చింతా గణేశ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఓయూలో గ్రూప్‌-1కు కూడా ఆర్ట్స్‌ కాలేజీలోనే 57వ నంబరు రూంలో ట్రైనింగ్‌ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.