AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS PGECET: రేపట్నుంచి తెలంగాణ పీజీఈసెట్‌- 2022 స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌.. షెడ్యూల్‌ ఇదే..

తెలంగాణ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)- 2022కు సంబంధించి ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తైన సంగతి తెలిసిందే. ఐతే రెండు విడతల కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందని విద్యార్ధులు..

TS PGECET: రేపట్నుంచి తెలంగాణ పీజీఈసెట్‌- 2022 స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌.. షెడ్యూల్‌ ఇదే..
TS PGECET 2022 Special Round Counselling Schedule
Srilakshmi C
|

Updated on: Nov 08, 2022 | 6:48 PM

Share

తెలంగాణ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)- 2022కు సంబంధించి ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తైన సంగతి తెలిసిందే. ఐతే రెండు విడతల కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందని విద్యార్ధులు స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నవంబర్‌ 9 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి రమేష్‌బాబు తెలిపారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ నవంబర్‌ 9 నుంచి 11 వరకు ఉంటుందన్నారు. అలాగే నవంబర్‌ 11, 12 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు. నవంబర్ 15న సెలక్షన్‌ లిస్టు విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్ధులు సంబంధిత సెంటర్‌లలో నవంబర్‌ 15 నుంచి 19 వరకు నిర్వహించే వెరిఫికేషన్‌ ప్రక్రియకు హాజరుకావల్సి ఉంటుందని అన్నారు.

కాగా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీఈసెట్‌ 2022లో సాధించిన ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌లో ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్ధులకు రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఎమ్‌ఈ/ఎంటెక్/ఎంఫార్మసీ/ఎంఆర్క్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ రౌండ్‌ కౌన్సెలింగ్‌ హెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ఈ మేరకు విడుదల చేసింది. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..