AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గట్టిగా అనుకుంటే ఏదైనా అయిపోతుంది.. యుట్యూబ్ క్లాసెస్ విని నీట్ రాంక్ కొట్టిన నిజామాబాద్ యువతి.

ఎంబీబీఎస్‌ సీటు సాధించాలనేది సగటు విద్యార్థి జీవిత లక్ష్యం. ఇందుకోసం ఎంతో కష్టపడి చదువుతుంటారు. పేరెంట్స్‌ కూడా తమ పిల్లలు ఎలాగైనా సీటు సంపాదించాలని కార్పొరేట్‌ కాలేజీల్లో చదివిపిస్తుంటారు. రూ. లక్షలు ఫీజులు పోసి కోచింగ్ ఇప్పిస్తుంటారు...

Telangana: గట్టిగా అనుకుంటే ఏదైనా అయిపోతుంది.. యుట్యూబ్ క్లాసెస్ విని నీట్ రాంక్ కొట్టిన నిజామాబాద్ యువతి.
Narender Vaitla
|

Updated on: Nov 08, 2022 | 7:20 PM

Share

ఎంబీబీఎస్‌ సీటు సాధించాలనేది సగటు విద్యార్థి జీవిత లక్ష్యం. ఇందుకోసం ఎంతో కష్టపడి చదువుతుంటారు. పేరెంట్స్‌ కూడా తమ పిల్లలు ఎలాగైనా సీటు సంపాదించాలని కార్పొరేట్‌ కాలేజీల్లో చదివిపిస్తుంటారు. రూ. లక్షలు ఫీజులు పోసి కోచింగ్ ఇప్పిస్తుంటారు. అయితే ఓ యువతి మాత్రం కేవలం యూట్యూబ్‌ వీడియోల్లో క్లాసులు వింటూ నీట్ ర్యాంక్‌ కొట్టేసింది. చదువుకోవాలనే సంకల్పం, ఏదైన సాధించాలనే సత్తా ఉండాలేకానీ సాకారం కానిది ఏదీ లేదని నిరూపించింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.? ఆమె సక్సెస్‌ స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

నిజామాబాద్‌కు చెందిన హారిక‌ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ టెస్ట్ లో స్టేట్ ర్యాంక్ సాధించారు. ఎన్నో ఫీజులు కట్టి, ప్రత్యక్ష తరగతులకు హాజరైనా రాని స్టేట్‌ ర్యాంకును యూట్యూబ్‌లో క్లాసులు విని దేశంలోని బెస్ట్‌ ర్యాంకును సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. హారిక పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది… హారికకు డాక్టర్ కావాలన్న కోరిక ఉన్నా నీట్ కోచింగ్‌కు వెళ్లే స్థోమత లేదు. అయినా వెనుకడుగు వేయలేదు. ప్రతి రోజూ యూట్యూబ్ లో వీడియో క్లాసులు చూసి పరీక్షలకు సిద్ధమైంది. ఈ సంవత్సరం నిర్వహించిన నీట్ ఎగ్జామ్‌లో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంక్ సాధించి రికార్ట్ సృష్టించింది.

నా విజయానికి అదే కారణం..

ఏడ‌వ త‌ర‌గ‌తి లో ఉన్నప్పుడు త‌న టీచ‌ర్ చేప్పిన మాట‌లు డాక్టర్‌గా త‌న ల‌క్ష్యం నిర్దేశించుకోవ‌డానికి కార‌ణం అయ్యాయని హారిక చెబుతోంది. అప్పటి నుంచి డాక్టర్ కావడానికి ఎలా ప్రిపేర్ కావాలో సాద‌న మొదలు పెట్టానని తెలిపింది. అమ్మ తామను చదివిపించడానికి పడ్డ కష్టాలు చూసే పట్టుదల మరింత పెరిగిందని చెప్పుకొచ్చింది. ర్యాంకు సాధించేకంటే ముందు హారిక రెండు సార్లు నీట్‌ పరీక్షకు హాజరైంది. అయితే ఆశించిన స్థాయిలో మార్కులను సాధించలేక పోయింది. కోచింగ్‌ తీసుకోవడానికి ఆర్థిక స్థోమత లేక యూట్యూబ్‌లోనే క్లాసులు విని ర్యాంకు సాధించిన హారిక ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై