AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నవంబర్15న రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభం.. ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..

తెలంగాణ రాష్ట్రంలో 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించడానికి ముహూర్తం ఖారారైంది. దాదాపు రూ.4,080 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్‌ కాలేజీలను..

Telangana: నవంబర్15న రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభం.. ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..
Eight new government medical colleges in Telangana
Srilakshmi C
|

Updated on: Nov 08, 2022 | 6:23 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించడానికి ముహూర్తం ఖారారైంది. దాదాపు రూ.4,080 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్‌ కాలేజీలను నవంబర్ 15న ప్రారంభించేందుకు తెలంగాణ ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, రామగుండం జిల్లాల్లో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెరచుకోనున్నాయి. జిల్లా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేసి కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీలకు అటాచ్ చేశారు. ఇక సర్కార్ అందుబాటులోని తీసుకొస్తున్న నూతన మెడికల్‌ కాలేజీల ద్వారా రాష్ట్ర వైద్య విద్యార్ధులకు 1,200 ఎంబీబీఎస్ సీట్లు లభించనున్నాయి. వీటితోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 85 శాతం బీ కేటగిరీ మెడికల్ సీట్లను సైతం విద్యార్థులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అదనంగా 1,068 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి.

2014లో తెలంగాణలో మొత్తం 850 ఎంబీబీఎస్‌ మెడికల్ సీట్లు ఉండగా, 2022 నాటికి సీట్ల సంఖ్య 2,901కి పెరిగింది. 2014లో 613 పీజీ సీట్లు ఉండగా 2022 నాటికి మొత్తం పీజీ గవర్నమెంట్‌ మెడికల్ సీట్ల సంఖ్య 1,249కి చేరింది. దీంతో రాష్ట్ర మెడికల్‌ విద్యార్ధులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈ 8 మెడికల్‌ కాలేజీలను నిర్మించిందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.