Telangana Polycet 2025 Exam: రేపే తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
పాలిటెక్నిక్ (డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష మంగళవారం (మే13) జరుగనుంది. దాదాపు 276 పరీక్ష కేంద్రాల్లో రేపు ఉదయం 11 గంటలకు ఈ పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో రాష వ్యాప్తంగా జరగనుంది. ఈ పరీక్ష హల్ టికెట్లను ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా..

హైదరాబాద్, మే 12: పాలిటెక్నిక్ (డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశానికి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (SBTET) నిర్వహించే టీజీ పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష మంగళవారం (మే13) జరుగనుంది. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. దాదాపు 276 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,06,716 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష రోజున గంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. విద్యార్ధులు నిమిషం ఆలస్యంగా వచ్చినా వెనక్కి పంపిస్తామని పాలీ సెట్ కన్వీనర్ స్పష్టం చేశారు. సెంటర్ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎస్‌బీటెట్ టీజీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే పాలీసెట్ అడ్మిట్ కార్డులు కూడా విడుదలైనాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ అడ్మిట్ కార్డ్‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ పాలిసెట్ 2025 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండిడ.
నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. పరీక్ష తేదీ ఇదే
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 అడ్మిట్ కార్డులను మే 12 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది. మే 18వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్‌లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది.
ఈ పరీక్ష 2 పేపర్లకు జరుగుతుంది. పేపర్ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నాం 12 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మద్యాహ్నాం 2.30 నుంచి 5.30 వరకు జరగనున్నాయి. అడ్మిట్ కార్డులు మే 11వ తేదీ నుంచి 18 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచునున్నట్లు ఐఐటీ కాన్పుర్ తెలిపింది. కాగా జేఈఈ మెయిన్స్ రెండు విడతల్లో ప్రతిభ చూపిన తొలి 2.50 లక్షల మంది విద్యార్ధులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయనున్నారు
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




