Telangana DME Counselling: నేడు 424 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో 424 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు మంగళవారం (ఆగస్టు 1) ఆన్‌లైన్ కౌన్సెలింగ్ జరగనుంది. తొలుత 183 పోస్టులను రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నవారికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 183 అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులను మాత్రమే ఖాళీలుగా చూపిన విద్యాశాఖ జూన్ 18న కౌన్సెలింగ్‌కు ప్రతిపాదించింది. ఐతే టీటీజీడీఏ, తెలంగాణ మెడికల్..

హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో 424 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు మంగళవారం (ఆగస్టు 1) ఆన్‌లైన్ కౌన్సెలింగ్ జరగనుంది. తొలుత 183 పోస్టులను రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నవారికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 183 అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులను మాత్రమే ఖాళీలుగా చూపిన విద్యాశాఖ జూన్ 18న కౌన్సెలింగ్‌కు ప్రతిపాదించింది. ఐతే టీటీజీడీఏ, తెలంగాణ మెడికల్ జేఏసీల ఆధ్వర్యంలో అసోసియేట్ ప్రొఫెసర్లు అందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అప్పట్లో కౌన్సెలింగ్ జరగకుండానే ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో తాజాగా వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ) కౌన్సెలింగ్‌కు మొత్తం 424 అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చూపింది. పోస్టుల సంఖ్య పెంచడంతో తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) అధ్యక్షుడు అన్వర్, ప్రధాన కార్యదర్శి జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షుడు కిరణ్ మాదాల, ట్రెజరర్ కిరణ్‌ప్రకాశ్ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి, డీఎంఈలకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో 424 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నేడు కౌన్సెలింగ్ జరగనుంది.
టీఎస్పీయస్సీ పరీక్షల ఫలితాలు
మరోవైపు టీఎస్పీయస్సీ ఆధ్వర్యంలో జరిగిన పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఈనెలాఖరు నుంచి వరుసగా ప్రకటించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది.




మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
