TG Inter Evalution 2025: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం!
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. మే 22 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు మే 29వ తేదీతో ముగిశాయి. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4.2లక్షల విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇక ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని మరింత పకడ్బందీగా చేసేందుకు..

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. మే 22 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు మే 29వ తేదీతో ముగిశాయి. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4.2లక్షల విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇక ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని మరింత పకడ్బందీగా చేసేందుకు ఇంటర్‌బోర్డు కొన్ని కీలక మార్పులు చేసింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని రెండు విడతల్లో చేపట్టనున్నారు. మే 29 నుంచి మొదటి విడత మూల్యాంకనం పూర్తైంది. ఇక మే 31 నుంచి రెండో విడత మూల్యాంకనం ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు ప్రతి అయిదు బోర్డులకు ఒక సబ్జెక్టు నిపుణుడు ఉండేవారు. ఆయన ఎగ్జామినర్లు దిద్దిన జవాబుపత్రాల్లో రోజుకు 20 చొప్పున పునఃపరిశీలించేవారు. తప్పుగా మార్కులు వేస్తే వాటిని సరిచేయడం జరిగేది. అయితే ఈసారి ప్రతి రెండు బోర్డులకు ఒక సబ్జెక్టు నిపుణుడిని ఇంటర్ బోర్డు నియమించింది. వీరు ప్రతిరోజూ 40 పేపర్ల పేపర్ల చొప్పున పరిశీలించాల్సి ఉంటుంది. ఫలితంగా మూల్యాంకనంలో తలెత్తే పొరబాట్లు మరింత తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
ఏపీ పీజీఈసెట్ 2025 హాల్‌టికెట్స్ విడుదల.. ప్రవేశ ప్రరీక్షల తేదీలివే!
ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 అడ్మిట్ కార్డులను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఫార్మ్.డీ (పీబీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 6, 8 తేదీల్లో ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ పీజీఈసెట్ 2025 హాల్‌టికెట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ 50 సివిల్ జడ్జి పోస్టుల రాత పరీక్ష తేదీలు విడుదల
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలు తాజాగా విడుదల అయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఎగ్జామినేషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు జులై 4వ తేదీ నుంచి 13 వరకు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 13న ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కింద మంత్తం 50 సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




