TG Nursing Officer Jobs: తెలంగాణలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఎవరు అర్హులంటే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 28, 2024వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. స్టాఫ్‌నర్స్ పోస్టులను రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు. పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన లేదా చేస్తున్న వారికి 20 మార్కులు అదనంగా కేటాయిరు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా అనుభవమున్న అభ్యర్థులు అనుభవ ధ్రువీకరణ పత్రాలను జత చేయవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు జీతంగా చెల్లిస్తారు.
గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్‌లో ఏ సేవలు అందించి ఉంటే.. ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింప జేస్తారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు నోటిఫికేషన్ జారీ తేదీ నాటికి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదు చేసుకుని ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 2024 జూలై 1 నాటికి 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేయడానికి అక్టోబర్ 16 ఉదయం 10.30 గంటల నుంచి అక్టోబర్ 17 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. రాత పరీక్ష నవంబర్ 17న ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది.
జోన్లవారీగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ ఉంటుంది. స్టాఫ్‌నర్స్ పోస్టులను జోన్లవారీగా భర్తీ చేయనున్నారు. మిగతావి ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. ఏయే జోన్‌లో ఏయే జిల్లాలు ఉన్నాయంటే..
- జోన్ 1లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలు
- జోన్ 2లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు
- జోన్ 3లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలుఔ
- జోన్ 4లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాలు
- జోన్ 5లో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం జిల్లాలు
- జోన్ 6లో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు
- జోన్ 7లో పాలమూరు, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు