TS TET 2023 Notification: మరోసారి టెట్‌ నిర్వహణకు సర్కార్ ఏర్పాట్లు.. త్వరలో నోటిఫికేషన్‌

తెలంగాణలో మరోమారు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 7న‌ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు అధికారులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలిచ్చారు. బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులై..

TS TET 2023 Notification: మరోసారి టెట్‌ నిర్వహణకు సర్కార్ ఏర్పాట్లు.. త్వరలో నోటిఫికేషన్‌
TS TET 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 09, 2023 | 5:55 PM

తెలంగాణలో మరోమారు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 7న‌ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి టెట్‌ జరిపేందుకు త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నాలుగోసారి టెట్‌ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం మరోమారు సమాయాత్త మవుతోంది. 2016 మే 22న తొలిసారి, 2017 జులై 23న రెండో సారి ఇలా వరుసగా రెండేళ్లు టెట్‌ నిర్వహించారు. ఆ తర్వాత ఐదేళ్లకు అంటే 2022 జూన్‌ 12న మూడోసారి పరీక్ష జరిపారు. టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) జరపాలని గత ఏడాది నిరుద్యోగ అభ్యర్థులు ఒత్తిడి పెంచడంతో టెట్‌ నిర్వహించిన తర్వాత నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఐతే టెట్‌ ఫలితాలు ఇచ్చి ఏడాది దాటినా ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తారన్న దానిపై ఆర్థిక శాఖ నుంచి ఇంతవరకూ అనుమతిరాలేదు. ఇక తాజాగా మరోసారి టెట్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది టెట్‌ పరీక్ష నిర్వహిస్తే పేపర్‌-1, పేపర్‌-2కు కలిపి దాదాపు 3.50 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఈ రెండింటి ఆధారంగా అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు. అందుకే టెట్‌ పరీక్షలో మంచి స్కోర్‌ సాధించాలని బెటర్‌మెంట్‌ స్కోర్‌ కోసం కూడా అధికమంది పోటీపడుతుంటారు. టెట్‌ నిర్వహించి సెప్టెంబరు నాటికి ఫలితాలు వెల్లడిస్తారు. ఆ వెంటనే అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వం సమాయాత్త మవుతుంది. దీంతో ఈ ఏడాది టీఆర్‌టీ నోటిఫికేషన్‌ దాదాపు లేనట్లేనని స్పష్టమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.