TGPSC Group 1 Mains: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే ఎంపిక.. ప్రభుత్వం క్లారిటీ!

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌ 1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 1:100 ప్రాతిపదికన ఎంపిక చేయాలని అభ్యర్ధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని అభ్యర్ధులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఏమాత్రం వీరి విన్నపాలను పట్టించుకోవడం లేదు. మెయిన్స్‌కు జీవో (నం.55, 29)లలోని నిబంధనల ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ..

TGPSC Group 1 Mains: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే ఎంపిక.. ప్రభుత్వం క్లారిటీ!
TGPSC Group 1 Mains
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 04, 2024 | 3:44 PM

హైదరాబాద్‌, జులై 4: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌ 1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 1:100 ప్రాతిపదికన ఎంపిక చేయాలని అభ్యర్ధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని అభ్యర్ధులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఏమాత్రం వీరి విన్నపాలను పట్టించుకోవడం లేదు. మెయిన్స్‌కు జీవో (నం.55, 29)లలోని నిబంధనల ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ తేల్చి చెప్పింది. ఈ మేరకు మెయిన్స్‌ పరీక్షకు అభ్యర్థుల్ని 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. మెయిన్స్‌ పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్‌ 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయడం సాధ్యం కాదని చేతులెత్తేసింది. ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్సీ మెమో జారీచేసింది.

మరోవైపు ప్రభుత్వం స్పందించకపోతే రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు, నిరాహారదీక్షలు చేస్తామని ఉద్యోగాల కోసం నిరుద్యోగులు హెచ్చరించారు. దీనిలో భాగంగా ఈ నెల 5న టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. డిమాండ్లు నెరవేర్చేందుకు గురువారం వరకు గడువని అల్టిమేటం జారీ చేశారు. ఆలోపు ప్రభుత్వం దిగిరాకుంటే నిరుద్యోగుల ధర్నా తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌, గ్రూప్‌ 1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి అమలతోపాటు గ్రూప్‌ 2, 3, డీఎస్సీలో పోస్టుల పెంపు వంటి చిలకపలుకులు పలికి, తీరా అధికారం చేజిక్కించుకున్నాక ఆ హామీలన్నీ ఏమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా టీజీపీఎస్సీ మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్ష జూన్‌ 9న ఉదయం నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయి. అయితే మెయిన్స్‌ పరీక్షకు మల్టీజోన్‌ 1, 2 వారీగా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని తొలి నుంచి అభ్యర్ధులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రతి మల్టీజోన్‌లో ఉద్యోగాల సంఖ్య ఆధారంగా 1:50 నిష్పత్తిలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తేల్చి చెప్పడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.