TG Textiles Notification 2024: తెలంగాణ చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే?

తెలంగాణ చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవల్సిందిగా ఆ శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం పోస్టుల్లో క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ పోస్టులు 8, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ పోస్టులు 22 వరకు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఐఐహెచ్‌టీ నుంచి చేనేత టెక్నాలజీలో..

TG Textiles Notification 2024: తెలంగాణ చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే?
TG Textiles Notification 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 21, 2024 | 7:44 AM

హైదరాబాద్‌, జులై 21: తెలంగాణ చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవల్సిందిగా ఆ శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం పోస్టుల్లో క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ పోస్టులు 8, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ పోస్టులు 22 వరకు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఐఐహెచ్‌టీ నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆమె వివరించారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలను తెలియజేస్తూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే వీటితో పాటు సంబంధిత ధ్రువపత్రాలను కూడా దరఖాస్తు సమయంలో సమర్పించాలని సూచించారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద ప్రాతిపదికన మూడేళ్లపాటు విధులు నిర్వహించవల్సి ఉంటుందని శైలజా రామయ్యర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

జులై 30వ నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ 2024 కౌన్సెలింగ్‌.. షెడ్యూల్‌ ఇదే

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మొత్తం 2 విడతల్లో కౌన్సెలింగ్‌ జరగనుంది. జులై 30వ తేదీన పీజీఈసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి అధ్యక్షతన జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ శనివారం జారీ చేశారు. స కాగా ఈ ఏడాది నిర్వహించిన పీజీఈసెట్‌లో మొత్తం 18,829 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కాలేజీల్లో కేవలం 8 వేల సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉత్తీర్ణులైన విద్యార్ధులంతా ఈ సీట్ల కోసం పోటీ పడనున్నారు. ఇందు కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొనవల్సి ఉంటుంది. ఆగస్టు 31వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.